Ads
కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ సందడి చేస్తుంటాడు. నాగబాబు కు వీర భక్తుడు అంటూ తన గుండెపై పచ్చబొట్టు వేసుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు ఆర్పీ.
Video Advertisement
మల్లెమాల ప్రొడక్షన్ ద్వారా పైకి వచ్చిన ఆర్పీ నాకు జబర్దస్త్ కానీ, మల్లెమాల ప్రొడక్షన్ గాని అసలు ఇష్టం ఉండదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఇది ఇలా ఉండగా త్వరలో ఆర్పీ ఒక ఇంటివాడు కాబోతున్నాడు.
తాను ప్రేమించిన యువతి కుటుంబం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో లక్ష్మీ ప్రసన్నతో నిశ్చితార్థం చేసుకున్నారు ఆర్పీ. అంటే ఈ కొత్త జంట త్వరలో వివాహానికి సిద్ధమవుతోంది. ఈ తరుణంలో కొత్త జంట అనేక ఈవెంట్ లో పాల్గొంటుంది. ఒక మీడియా ఇంటర్వ్యూ లో ఆర్తితో మీకు పరిచయం ఎలా ఏర్పడింది లక్ష్మీప్రసన్న అని అడగగా మొదట ఈయన మా ఇనిస్టిట్యూట్ గెస్ట్ గా వచ్చారు. బయటకు వెళుతూ ఆయన ఫోన్ నెంబర్ అడిగారు. నేను నా ఫోన్ నెంబర్ బదులుగా మా అమ్మ ఫోన్ నెంబర్ ఇచ్చాను.
అప్పటి నుంచి మా అమ్మతో ఏడాది వరకు ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవారు. అలా మా అమ్మతో మంచి అనుబంధం ఏర్పరచుకున్నారు. ఏడాది తర్వాత నేను మాట్లాడటం మొదలుపెట్టాను ముందు మా ఫ్యామిలీకి దగ్గరైన తర్వాత నాకు దగ్గరయ్యాడు ఆర్పీ.
ఆ తర్వాత నేనంటే ఇష్టమని విషయం మా తల్లిదండ్రులకు చెప్పాడు. మొదటిలో సినిమా వాళ్లు అంటే మంచి అభిప్రాయం లేక మా పెళ్లికి అంగీకరించలేదు. ఇక లాభం లేదని మా బంధువుల ఒప్పించడం మొదలుపెట్టాడు. అందర్నీ ఒప్పించి మా లవ్ స్టోరీ సక్సెస్ కావడానికి రెండు సంవత్సరాలు పట్టింది అని చెప్పుకొచ్చారు ఆర్పీ కాబోయే భార్య లక్ష్మీ ప్రసన్న.
End of Article