10 నెలల పాపకి “రైల్వేస్” లో ఉద్యోగం..! అంత పసి పాపకి ఉద్యోగం ఎలా ఇచ్చారంటే..?

10 నెలల పాపకి “రైల్వేస్” లో ఉద్యోగం..! అంత పసి పాపకి ఉద్యోగం ఎలా ఇచ్చారంటే..?

by Anudeep

Ads

సర్కారీ వారి కొలువులో ఉద్యోగం పొందాలంటే మనవాళ్లు ముప్పుతిప్పలు పడుతుంటారు. డిగ్రీ పట్టాలు చేతికి రాగానే ఉద్యోగాల వేటలో పడుతూ. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగులు తీసుకుంటూ వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తుంటారు. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటారు.

Video Advertisement

ప్రిలిమ్స్, మెయిన్ అంటూ పుస్తకాలతో కుస్తీపడి టెస్టులకు అటెండ్ అవుతూ జస్ట్ పాయింట్ లో మార్కులు పోగొట్టుకుని, మళ్ళీ ఎంతో కష్టపడుతూ చివరికి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. కానీ ఇక్కడ ఒక చిన్నారి కేవలం 10 నెలల వయసులోనే ఉద్యోగ బాధ్యతలు చేపట్టింది. అతి చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించి చరిత్ర సృష్టించింది.

10 months baby got railway job

 

ఏంటి పది నెలల పాప కి ఉద్యోగం అంటూ ఆశ్చర్యపోతున్నారా.. అసలు ఆ పాపకి ఏ ఉద్యోగం వచ్చింది.. ఏ శాఖలో వచ్చింది  అనే అసలు విషయంలోకి వెళ్తే… ఆ పాప పేరు రాధిక. స్వస్థలం ఛత్తీస్గఢ్. రాయపూర్ లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగంలో నియమితమయింది. పాపను ఉద్యోగంలో నియమించే ప్రక్రియ మొత్తం రైల్వే అధికారులు  పూర్తి చేశారు. దీని కోసం చిన్నారి వేలిముద్రలు కూడా తీసుకున్నారు. పాపకి  18 సంవత్సరాలు నిండిన తర్వాత రైల్వే శాఖ పదవి  బాధ్యతలను అప్పగిస్తుంది.

ఆగ్నేయ మధ్య రైల్వే చరిత్రలో ఉద్యోగం సంపాదించిన అతి చిన్న వయస్కురాలు గా రాధిక  రికార్డులను సృష్టించింది. రైల్వే శాఖలో పనిచేసిన రాధిక తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకం కల్పించారు. ఆమె తండ్రి రాజేంద్ర కుమార్ యాదవ్ భిలాయ్ లోని రైల్వే పీపీ యార్డులో అసిస్టెంటుగా మూడేళ్ల క్రితం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. రాజేంద్ర అతని భార్య  మంజు యాదవ్, బిడ్డతో కలిసి జూన్ 1న భిలాయ్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. పాపం మాత్రం ప్రాణాలతో బయటపడింది. తల్లిదండ్రుల మరణంతో ఒంటరిగా మిగిలిన పాపకు రైల్వే కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇవ్వాలని రైల్వే అధికారులు నిర్ణయించుకున్నారు. ఉద్యోగానికి సంబంధించిన అన్ని ప్రక్రియలూ పూర్తి చేశారు.


End of Article

You may also like