రామ్ పోతినేని “ది వారియర్” తమిళ్ వర్షన్‌లో… ఈ మార్పులు చేయబోతున్నారా..?

రామ్ పోతినేని “ది వారియర్” తమిళ్ వర్షన్‌లో… ఈ మార్పులు చేయబోతున్నారా..?

by Anudeep

Ads

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం “ది వారియర్”. లింగుసామి దీనికి దర్శకత్వం వహించగా శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. ఇందులో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ కాగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీని జూలై 14న గ్రాండ్ గా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Video Advertisement

రామ్ తో ది వారియర్ మూవీ చేసిన లింగుసామి సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఫైనల్ కాపీ చూసిన చిత్రబృందం తెలుగులో కొన్ని మార్పులు సూచించారట. తమిళ సినిమాల్లో విలనిజం రా గా ఉంటుంది. ది వారియర్ సినిమాలో కూడా విలన్ ఆది పినిశెట్టిని డైరక్టర్ లింగుసామి చాలా వైల్డ్ గా చూపించారట. కానీ తెలుగులో ఆ రేంజ్ విలనిజం యాక్సెప్ట్ చేస్తారా అన్న అనుమానంతో తెలుగులో కొన్ని మార్పులు చేశారట.

సెకండ్ హాఫ్ లో తమిళ్ లో ఉన్న కొన్ని సీన్స్ తెలుగులో ఉండవని అంటున్నారు. తమిళ ఆడియెన్స్ వాటిని రిసీవ్ చేసుకున్నంతగా తెలుగు ఆడియెన్స్ ఆ ఊర మాస్ సీన్స్ రిసీవ్ చేసుకోరని ఈ నిర్నయం తీసుకున్నారట. రామ్ కూడా ఈ విషయంలో డైరక్టర్ నిర్ణయాన్ని ఫైనల్ అనేశాడట. సో ది వారియర్ లో తమిళంలో ఉన్న కొన్ని సీన్స్ తెలుగులో ఉండవని అంటున్నారు.


End of Article

You may also like