ఈ విషయంలో చిరంజీవి, నాగార్జున… ఆ “స్టార్ హీరో” ని ఫాలో అవుతున్నారా..?

ఈ విషయంలో చిరంజీవి, నాగార్జున… ఆ “స్టార్ హీరో” ని ఫాలో అవుతున్నారా..?

by Anudeep

Ads

ఇటీవల విడుదలైన విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన “విక్రమ్” మూవీ ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఓ వైపు ఓటీటీ లో సినిమా రిలీజ్ అయినా కూడా థియేటర్లలో సినిమా ఇంకా ఆడుతుంది. ఇందులో  కమల్ యాక్షన్ సీన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Video Advertisement

అయితే మొన్న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్, ఈ రోజు విడుదలైన కింగ్ నాగార్జున ది ఘోస్ట్ టీజర్ విక్రమ్ మూవీకి అనేక పోలికలు ఉండడం గమనార్హం. అంతే కాదు విక్రమ్ మూవీలో వాడినట్టుగానే ఈ రెండు సినిమాలకు కూడా రెడ్ కలర్ ఫాంట్, హీరోస్ బ్లాక్ కస్ట్యూమ్స్ వాడడం, బాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ విక్రమ్ మూవీకి దగ్గరగా ఉన్నాయి.

ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతం యాక్షన్ మూవీస్ హవా నడుస్తున్నట్టు తెలుస్తుంది. కమల్ ఓ మార్క్ సెట్ చేస్తే ప్రెసెంట్ చిరు మరియు నాగార్జున ఆ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నారు. చూడాలి విక్రమ్ మూవీలాగే ఇవి కూడా హిట్ కొడతాయో లేదో..  గాడ్ ఫాదర్ మలయాళం లూసిఫర్ సినిమాకు రీమేక్ కాగా మోహన్ రాజా దీనికి దర్శకత్వం వహించారు. నాగార్జున ది ఘోస్ట్ మూవీకి ప్రవీణ్ సత్తార్ డైరెక్టర్ కాగా అక్టోబర్ 5 న దీన్ని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.


End of Article

You may also like