Ads
టాలీవుడ్ కు చెందిన కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రణీత. పవన్ కల్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’, మహేశ్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’, జూనియర్ ఎన్టీఆర్ తో ‘రభస’, మంచు విష్ణుతో పాండవులు పాండవులు ‘తుమ్మెద’, రామ్‌తో ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాలతో అలరించారు.
Video Advertisement
టాప్ హీరోల సరసన నటించిన ప్రణీత స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకవయింది. గతేడాది ‘హంగామా2’, ‘భూజ్, సినిమాలతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. బాలీవుడ్ లో మంచి సక్సెస్ లో ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇన్ స్టాలో ఒక ఫోటో పోస్ట్ షేర్ చేసింది ప్రణీత. తన ఆరోగ్యం అస్సలు బాగోలేదు కానీ ఫోటో ఫిల్టర్స్ మాత్రం బాగా హెల్ప్ చేస్తున్నాయి అని తెలిపింది. ఇక ఆమె షేర్ చేసుకున్న పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఆ ఫోటోకు బాగా లైకులు కొడుతున్నారు ఫాలోవర్స్. ప్రణీత సుభాష్ మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందో లేదో అని అనుమానాలు ఎదురవుతున్నాయి. కానీ తాను మాత్రం ప్రస్తుతం ఫ్యామిలీతో బిజీగా ఉందని, ఈ సమయంలో తన కూతురికి, తన ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తుంది.
End of Article