Ads
మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుతున్న వర్షిణి మిస్సింగ్ కేస్ ని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. వర్షిణి ముంబైలో ఉన్నట్టు గుర్తించారు. తెలంగాణ పోలీసులు ముంబై పోలీసులతో మాట్లాడి విద్యార్థి క్షేమంగా ఉన్నట్టు తెలుసుకున్నారు.
Video Advertisement
అసలేం జరిగిందంటే.. సీఎమ్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది వర్షిణి. మిడ్ ఎగ్జామ్స్ కోసం ఆమెను బంధువు మోహన్ రెడ్డి కాలేజ్ కు తీసుకెళ్లారు. కాసేపటికి ఐడీ కార్డు, మొబైల్ మరిచిపోయాను అని క్యాంపస్ నుంచి బయటకు వచ్చింది వర్షిణి. ఆ తర్వాత తిరిగి సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు స్పెషల్ టీం ను ఏర్పాటు చేశారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో వర్షిణి ఇన్ స్టా అకౌంట్ ముంబైలో ఓపెన్ అయినట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమె ఉన్న సెల్ టవర్ ఆధారంగా అక్కడ ఉన్న పోలీసులకు సమాచారం అందించారు తెలంగాణ పోలీసులు. ప్రస్తుతం వర్షిణి రైల్వే పోలీసు ఆధీనంలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. వెంటనే ఆమె పేరెంట్స్ తో కలిసి మేడ్చెల్ పోలీసులు ముంబై బయల్దేరి ఆమెను తీసుకొని తిరిగి హైదరాబాద్ బయల్దేరారు. ఎగ్జామ్స్ వల్ల డిప్రెషన్ కు లోనవ్వడం వల్లే వర్షిణి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది.
End of Article