“మహేష్ బాబు” కోసం “త్రివిక్రమ్”… మొదటిసారిగా ఈ కాన్సెప్ట్ టచ్ చేయబోతున్నారా..?

“మహేష్ బాబు” కోసం “త్రివిక్రమ్”… మొదటిసారిగా ఈ కాన్సెప్ట్ టచ్ చేయబోతున్నారా..?

by Anudeep

Ads

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత సూపర్ స్టార్  మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది అంటూ ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. ఎట్టకేలకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభం కానుంది.

Video Advertisement

దాదాపు 11 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రం భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. హారిక హాసిని క్రియేషన్ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టు ను ప్రారంభిస్తున్నట్లు ఈ సోమవారం సాయంత్రం ప్రకటించింది. ఈ చిత్రానికి గానూ సినిమాటోగ్రాఫర్ గా మదీ మరియు జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గాను, ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్ ప్రకాష్ పని చేస్తున్నారు.  ఈ చిత్రానికి గాను ఎమ్ ఎస్ తమన్ సంగీత దర్శకత్వం వహించబోతున్నారు అని నిర్మాణ సంస్థ వెల్లడించింది.

Ssmb28

 

ఈ చిత్రానికి  రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ వ్యవహరించబోతున్నారు. పొలిటికల్ డ్రామా కథాంశంగా త్రివిక్రమ్ ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు అని తెలుస్తోంది. ఇప్పటి  కాలంలో రాజకీయం అనేది ఎలా మార్పులు చెందింది. రాజకీయం అనేది బిజినెస్ గా మార్చుకొని ఎలా లాభపడుతున్నారు అనే విషయం కథాంశం పై తెరకెక్కుతున్నట్లు  వార్తలు వినిపిస్తున్నాయి. ఎటువంటి పొలిటికల్ పార్టీని టార్గెట్ చేయకుండా, రాజకీయ నేతలు ఏ విధంగా మారితే ప్రజలకు ఉపయోగం జరుగుతుంది అనే అంశంతో ఈ కథను నడిపించేబోతున్నారు అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో అలా వైకుంఠపురం చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో  రూపొందబోతోంది ssmb28. ఈ చిత్రానికి గాను మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా  నటిస్తున్నట్లు వెల్లడవుతుంది.  మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ అంచనాలతో 2023 సంవత్సరాలలో వేసవి కానుకగా రానుంది ఈ చిత్రం. ఎంతోకాలం తర్వాత త్రివిక్రమ్ మరియు మహేష్ కాంబినేషన్లో రాబోయే ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను మించి  ఉండబోతుందా అనేది వేచి చూడాలి.


End of Article

You may also like