Ads
ఓ ప్రముఖ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అందరికి తెలిసిందే. ఈ షో ఎంతోమంది ఆర్టిస్ట్ లకు జీవితాన్ని ఇచ్చింది. ఇందులో గుర్తింపు పొందిన అనేక మంది సినిమాల్లో కూడా నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. కొందరైతే ఏకంగా హీరోగా కూడా చేస్తూ, తెలుగు ఇండస్ట్రీలో సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తున్నారు.
Video Advertisement
అయితే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కార్యక్రమంలో వరుసగా కంటెస్టెంట్ లు వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలోనే చమ్మక్ చంద్ర టీం ద్వారా జబర్దస్త్ కు పరిచయమైన లేడీ కమెడియన్ సత్యశ్రీ గురించి అందరికీ తెలిసిందే. ఆమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఎన్నో సీరియల్స్, సినిమాల్లో నటించిన రాని గుర్తింపు ఈ కార్యక్రమం ద్వారా వచ్చింది.
అయితే చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో సత్య శ్రీ కూడా బయటకు వెళ్లిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి కారణాలు ఏంటో తెలిపారు. తనకు జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం కల్పించింది చమ్మక్ చంద్ర కనుక తనని గురువుగా భావించానని అయితే తమ గురువు ఆ కార్యక్రమాన్ని వదిలి వెళ్లడంతో అతను ఉన్న చోటే మేము కూడా ఉండాలన్న ఉద్దేశంతో మా టీమ్ మొత్తం జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసిందని సత్య శ్రీ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది.
End of Article