Ads
ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బాస్టర్స్ తీసిన సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎమ్ఎస్ రాజు తనయుడిగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చాడు సుమంత్ అశ్విన్. మొదటి సినిమా తూనీగా తూనీగాకు తన తండ్రి ఎమ్ఎస్ రాజు డైరెక్టర్ కాగా ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ఆ తర్వాత కేరింత, అంతకుముందు ఆ తర్వాత, కొలంబస్, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాలు చేసినప్పటీ ఆశించిన ఫలితాలు రాలేదు.
Video Advertisement
ఇటీవల సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ సినిమాతో వచ్చినా అది కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూల్లో పాల్గొన్న సుమంత్ అశ్విన్ తన తీరు మార్చుకున్నట్లు, ప్రమోషన్ చేయకపోతే సినిమాలు ప్రేక్షకులకు చేరువ కావని అర్థమైందని తెలిపారు.
ఇక మా నాన్న సినిమాల వల్ల బ్రేక్ వచ్చిన రాక్ స్టార్ దేవి శ్రీ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని ఇంతకు ముందే మేమిద్దరం కలిసి వర్క్ చేయాల్సింది కానీ కుదరలేదు. దేవి శ్రీ ప్రసాద్ నాతో వర్క్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాడు అంటూ సుమంత్ తెలిపాడు. నాన్న వల్ల ఎదిగిన వాళ్ళందరు కెరీర్ లో బిజీగా ఉన్నారు కానీ ఒకవేళ వచ్చి నాకోసం ప్రమోషన్ చేయమంటే తప్పకుండా వస్తారు అంటూ చెప్పాడు. స్టోరీ డెసిషన్ నాదే ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చాడు సుమంత్ అశ్విన్.
End of Article