Ads
మెగా డాటర్ శ్రీజను వివాహాం చేసుకొని మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టాడు కళ్యాణ్ దేవ్. అలాగే విజేత సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే ప్రస్తుతం కళ్యాణ్ మెగా కాంపౌండ్ కి చెందిన వాడా కాదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల మధ్య నిజంగానే మనస్పర్ధలు వచ్చాయా? వారు విడిపోయారా? లేదంటే విడాకులు తీసుకోబోతున్నారా?
Video Advertisement
సోషల్ మీడియాలో వీరిద్దరిపై జోరుగా ప్రచారాలు జరుగుతున్నప్పటికీ ఇరు కుటుంబాలు దీనిపై విషయంపై స్పందించడం లేదు.కానీ శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల సోషల్ మీడియా ఖాతాలు చూస్తే విడివిడిగా ఉంటున్నారని అర్థమవుతుంది. అంతేకాదు మెగా ఇంట్లో జరుగుతున్న ఈవెంట్లకు, సెలబ్రేషన్స్ కు కళ్యాణ్ దేవ్ హాజరు కావడం లేదు. ఇటీవలే కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి సినిమా ప్రమోషన్స్ లో మెగా ఫ్యామిలీ పాల్గొనలేదు.
ఇది ఇలా ఉంటే తాజాగా కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ రాసుకోచ్చారు. హ్యాపీ బర్త్డే మామ్.. జీవితం ఒక్కోసారి ఎంతో కష్టంగా మారుతుంది. కానీ నీ ప్రేమ వల్ల వచ్చే శక్తితో వాటినింటిని ఎదుర్కొంటాను అన్న నమ్మకం నాకు ఉంది. నాకు ఎల్లప్పుడూ సపోర్ట్ గా నిలుస్తున్నందుకు థాంక్స్. లవ్ యు సో మచ్ మా అంటూ కళ్యాణ్ దేవ్ తన తల్లి పై ప్రేమను కురిపించాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా కళ్యాణ్ దేవ్ కూతురు నివృత్తి పుట్టినరోజు సందర్భంగా కనీసం విషెస్ చెప్పినట్టుగా కూడా కనిపించడం లేదు. కళ్యాణ్ దేవ్ పోస్ట్ కింద ఇవ్వబడింది.
https://www.instagram.com/p/Cf4CnMqhnwQ/?igshid=MDJmNzVkMjY=
End of Article