Ads
కొరటాల శివ టాలీవుడ్ లో పరిచయం అవసరం లేని పేరు. కమర్షియల్ సినిమాల్లో కూడా సామాజిక స్పృహను టచ్ చేయడం ఆయన ప్రత్యేకత. భద్రతో రైటర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారాడు కొరటాల. ఆ తర్వాత వరుసగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భారత్ అనే నేను వంటి సూపర్ హిట్లతో అపజయం ఎరుగని డైరెక్టర్ గా దూసుకుపోయాడు.
Video Advertisement
అయితే ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దీంతో కెరీర్ లో తొలిసారి అపజయం మూట కట్టుకున్నాడు కొరటాల శివ. అయితే ఆచార్య తర్వాత వెంటనే కొరటాల జూనియర్ ఎన్టీఆర్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలి కానీ ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఏం రావట్లేదు.
దీనికి కారణం ఆచార్య కు సంబంధించిన నష్టాలు ఇంకా కొరటాలను వేటాడుతున్నట్టు సమాచారం. ఈ నష్టాలను పూడ్చుకుంటే కానీ ఎన్టీఆర్ తో మూవీనీ ప్రశాంతంగా ప్రారంభించలేడు. అందుకే ఎన్టీఆర్ తో మూవీ ఆలస్యానికి కారణం అయ్యి ఉండొచ్చు. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో ఇది రెండో సినిమా. అలాగే ఎన్టీఆర్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు మధ్య ఓ సినిమాకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. ఆ మధ్య ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో మరో మూవీ చేస్తాడు అన్నారు కానీ దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. అయితే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నాడు ఎన్టీఆర్.
End of Article