“జబర్దస్త్” చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న కమెడియన్ ఎవరో తెలుసా..? ఇది అస్సలు ఊహించలేదే..?

“జబర్దస్త్” చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న కమెడియన్ ఎవరో తెలుసా..? ఇది అస్సలు ఊహించలేదే..?

by Anudeep

Ads

టెలివిజన్ రంగంలో జబర్దస్త్ క్రేజ్ మాములుగా ఉండదు, దీనికి తోడు యూట్యూబ్ లో కూడా ఆ వీడియోలే ట్రెండ్ అవుతూ ఉంటాయి. కానీ ఇటీవల ఒక్కసారిగా ఈ షో రేటింగ్ డౌన్ అయినట్టు తెలుస్తుంది. దీనికి కారణం ఈ కామెడీ షో నుంచి కొంత మంది కమెడియన్స్ బయటకు వెళ్లిపోతూ అనేక రకాల ఆరోపణలు చేయడం.

Video Advertisement

2013లో మొదలైన జబర్దస్త్ ఆ తర్వాత కొన్నేళ్ల వరకు కూడా టాప్ రేటింగ్ లో కొనసాగింది. అయితే అందులో నుంచి కొన్నాళ్ళకు కొంతమంది సీనియర్ కమెడియన్స్ వివిధ కారణాలతో బయటకు వెళ్ళిపోతున్నారు. కొందరు సినిమా అవకాశాలు రావడంతో వెళ్ళిపోగా మరి కొందరు మాత్రమే నిర్వాహకుల తీరు నచ్చకపోవడంతో వెళ్లిపోవాల్సి వచ్చింది.

మొదట జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోవడంతో ఆ షోపై ఎన్నో రకాల అనుమానాలు వచ్చాయి. అయితే జబర్దస్త్ ద్వారా మంచి పారితోషికం అందుకున్న వారి సంఖ్య అయితే ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా టీమ్ లీడర్స్ అందరికంటే ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్స్ అందుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు 18 రేటింగ్ వచ్చినప్పుడు మినిమం సైడ్ క్యారెక్టర్ లో నటించిన వారికి కూడా ఎపిసోడ్ కు 5 వేలకు పైగా ఇచ్చారట. ఇక టీమ్ లీడర్స్ అయితే లక్షల్లో పారితోషికాలు అందుకున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా అప్పారావు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ లో మొన్నటి వరకు సుడిగాలి సుధీర్ కొనసాగినప్పుడు అతను అందరికంటే ఎక్కువ పారితోషికం అందుకున్నట్లుగా తెలిపాడు. అతని రెమ్యునరేషన్ ఎంత అని మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం సుడిగాలి సుధీర్ ఒక్కో ఎపిసోడ్ కు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు అందుకునే వాడట. అయితే జబర్దస్త్ లో ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో అత్యధికంగా పారితోషికం అందుకున్న వారిలో మాత్రం చమ్మక్ చంద్ర టాప్ లిస్టులో ఉంటాడు అని అప్పారావు క్లారిటీ ఇచ్చాడు.

సుధీర్ కంటే ముందు అతను ఉన్నప్పుడు అందరి కంటే ఎక్కువగా సీనియారిటీ ప్రకారం చమ్మక్ చంద్రకు ఇచ్చేవారు అని తెలిపాడు. ఇక మార్కెట్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే చమ్మక్ చంద్ర ఒక్క ఎపిసోడ్ కు 2 లక్షల పైగానే రెమ్యూనరేషన్ అందుకునేవారని తెలుస్తుంది.


End of Article

You may also like