Ads
మనలో ఎంతో మందికి పర్యాటక విదేశీ ప్రదేశాలు చూడాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ సరైన ఆదాయం లేకనో, మనకుండే బాధ్యతలు వలనో అనుకున్న పని చేయలేకపపోతుంటాం. విదేశాల చూసి రావడం అనేది కేవలం డబ్బున్న వాళ్ళకు మాత్రమే జరుగుతుంది అంటుంటాం.కానీ ఇక్కడ ఒక ఆవిడ అనుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు అనేది నిరూపించింది. పేదరికంలోను రూపాయి రూపాయి కూడా పెట్టుకుంటూ పదేళ్లలో 11 దేశాలు చుట్టి వచ్చింది. ప్రపంచం మొత్తం చూసి రావడమే తన లక్ష్యం అంటుంది. ఈమె కథ ఎందరికో స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం.
Video Advertisement
ఆమె పేరు మొళిజాయ్. కేరళలోని ఎర్నాకుళం జిల్లా చిత్రపుళం ప్రాంతానికి చెందిన మొళికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలు చూడాలనేది ఆమె కోరిక . చిన్న వయసులోనే జాయ్ అనే వ్యక్తితో వివాహం అయింది మొళికి. కిరాణా దుకాణం నడపడంలో సాయం చేస్తుండేది. కిరాణా దుకాణం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో జాయ్ కూలిగా మారాడు.
పెళ్లయిన పదేళ్లకే భర్త అనారోగ్యంతో అందించడంతో కుటుంబ బాధ్యతలు మొత్తం మొళిపైన వేసుకుంది. తనకు పుట్టిన ఇద్దరు పిల్లలను చదివించి ప్రయోజకులను చేసింది. కొడుకు ఉద్యోగరీత్యా విదేశాలలో స్థిరపడ్డాడు. కూతురికి పెళ్లి చేసి తన బాధ్యతలను తీర్చుకుంది మొళి. కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తుంది. చిన్నతనంలో చదివించడానికే కష్టపడే తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తోటి విద్యార్థులతో విహార యాత్రకు వెళ్లే అవకాశం కూడా దక్కలేదు. పిల్లల బాధ్యత తీరిన తర్వాత కేరళ నుంచి తన మొదటి పర్యటన మొదలు పెట్టి ఇప్పటి వరకు ఆమె పర్యటన కొనసాగిస్తుంది.
కిరాణా దుకాణం నడుపుతూనే రూపాయికి రూపాయి పొదుపు చేసి మధురై, ఊటీ, కొడైక్కెనాల్, మైసూర్ వంటివి వెళ్లి వచ్చింది. ఇక్కడ తో నా కోరిక తీరలేదు. ప్రపంచం మొత్తం చూసిరావాలనే కోరిక మరంత ఎక్కువ అయింది అంటుంది మొళి. తన స్నేహితురాలు మేరీ విదేశీ పర్యటనకు వెళ్తున్నాను నువ్వు వస్తావా అని అడిగిన వెంటనే ఓకే చెప్పేసిందట. 2012 విమానం ఎక్కాను.
అలా పది రోజులు దేశం దాటి ఐరోపా పర్యటనకు వెళ్లాను. ఐదు పదుల వయసులోనే ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, అమెరికా తదితర దేశాలను చూసి వచ్చాను. తనతో పాటు వచ్చిన వారు షాపింగ్ చేస్తూ వుంటే, తను మాత్రం చాక్లెట్లు కొనుక్కుంటే డబ్బును పొదుపుగా వినియోగించుకుంటూ ప్రయాణం కొనసాగించేవారు అని చెప్పుకొచ్చారు మొళి. 2012 లో మొదలుపెట్టిన ఆమె ప్రయాణం ఇప్పటి వరకు కొనసాగుతునేవుంది.
End of Article