నాగ చైతన్య “థాంక్యూ” ట్రైలర్‌లో ఇవి గమనించారా..? వీటి వెనుక అర్థం ఏంటి..?

నాగ చైతన్య “థాంక్యూ” ట్రైలర్‌లో ఇవి గమనించారా..? వీటి వెనుక అర్థం ఏంటి..?

by Anudeep

Ads

అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా హీరో, హీరోయిన్లు నటిస్తున్న చిత్రం థాంక్యూ. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం.  డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కు అక్కినేని ఫ్యామిలీ కి ప్రత్యేక అనుబంధం ఉంది. మనం సినిమాతో వారికి దగ్గర అయ్యి, అఖిల్ తో హలో చేసాడు విక్రమ్. ఇప్పుడు చైతూ తో థాంక్యూ తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.

Video Advertisement

అయితే నిన్న విడుదలైన థాంక్యూ ట్రైలర్‌లో మాత్రం నాగ చైతన్య పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు ఉన్నట్టు అనిపిస్తోంది. ఆ డైలాగ్స్ అన్నీ కూడా చైతన్య జీవితానికి రిలేట్ ఉన్నాయి. ‘మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువ ఉండదు.. అని నా ఫ్రెండ్ చెప్పాడు’, ‘ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే.. స్వేచ్చగా వదిలేయగలిగే ప్రేమే ఎంతో గొప్పది..’ అనే డైలాగ్స్ నాగ చైతన్య జీవితానికి సంబంధించినట్టుగానే అనిపిస్తున్నాయి.

ఇంతకు ముందు వచ్చిన టీజర్ లో కూడా “లైఫ్ లో ఇంకా కంప్రమైస్ అయ్యేదే లేదు.. ఎన్నో వదులుకొని ఇక్కడి వరకు వచ్చా..” “నన్ను నేను సరిచేసుకోవడానికి చేస్తున్న ప్రయాణమే ఇది..” అనే మాటలు కూడా చైతూ జీవితాన్ని గుర్తుకు తెస్తున్నాయి. దాంతో చాలామంది ఈ డైలాగ్స్ వెనకాల ఉన్న అర్థం వెతకడం మొదలు పెట్టారు. ఇప్పుడు మాత్రమే కాకుండా అంతకు ముందు విడుదలైన టీజర్ లో కూడా ఇలాంటి డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. అప్పుడు కూడా “ఈ డైలాగ్స్ వెనకాల అర్థం ఏంటి?” అని అన్నారు.

thank you 2

ఇంక సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. ఈ నగరానికి ఏమైంది సినిమాలో హీరోగా నటించిన సుశాంత్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక నాగ చైతన్య మాత్రం ఎన్నడూ కనిపించని విధంగా కొత్తగా కనిపిస్తున్నాడు. డైలాగ్స్, విజువల్స్, రొమాన్స్, యాక్షన్ ఇలా ప్రతీ ఒక్క యాంగిల్‌లో థాంక్యూ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ చిత్రం జూలై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


End of Article

You may also like