Ads
బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే అలాగే అందులో కామెడియన్లకు కూడా అంతే ఫేమ్ ఉంటుంది. అందులో రీతూ చౌదరి కూడా ఒకరు. జబర్దస్త్ స్కిట్స్ చేస్తూ జనాల్లో పాపులారిటీ పెంచుకుంది రీతూ. జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గరైంది.
Video Advertisement
కామెడీకి తోడు గ్లామరస్ లుక్స్‌తో అభిమానులను సొంతం చేసుకుంది రీతూ. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది రీతూ చౌదరి. తాజాగా రీతూ తనకు కాబోయే భర్త గురించి ఓ క్లారిటీ ఇవ్వడంతో ఆమె పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్ అయింది. ఆమె పోస్ట్ చేసిన ఫొటో ఉన్నది రీతుకి కాబోయే భర్తనే అని చెప్పుకుంటున్నారు జనం. మా బంధం కంటే ఏది ఎక్కువ కాదు అంటూ శ్రీకాంత్ అనే ఒక వ్యక్తితో దిగిన ఫోటోను షేర్ చేసింది రీతూ.
అయితే ఆమె ప్రేమ అని గానీ, పెళ్లి అని గానీ ఏం చెప్పలేదు. ఆ పోస్ట్ చూడగానే ఒక్కసారిగా రీతూ పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు రీతుకి కాబోయే భర్త పెద్ద వ్యాపారవేత్త అని సమాచారం. ప్రస్తుతం రాజకీయాల్లో శ్రీకాంత్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు హైదరాబాద్, బెంగళూరు లో బాగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం తెలిసి రీతూ బాగానే సెట్ చేసుకుందిగా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
End of Article