Ads
కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లో సెల్ఫ్ మేడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకు ముందు విడుదలైనవి మూడు చిత్రాలే అయినా… ప్రస్తుతం పలు అగ్ర నిర్మాణ సంస్థలు అతనితో సినిమాలు నిర్మిస్తున్నాయి. ‘రాజాగారు రాణివారు’తో హీరోగా పరిచయమైన కిరణ్ రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కని ఆదరణ పొందింది.
Video Advertisement
అయితే మూడో చిత్రం ‘సెబాస్టియన్’ నిరాశ పరిచినా.. అతని నాలుగో సినిమా ‘సమ్మతమే’ కి మంచి టాక్ వచ్చింది.
ఈ చిత్రానికి గోపీనాథ్ రెడ్డిని డైరెక్టర్ కాగా చాందిని చౌదరి హీరోయిన్ గా చేసింది. ఈ మూవీ ఇటీవల ఓటీటీలో కూడా విడుదలైంది. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉండగా సినిమాలో హీరో, మొదటిసారి హీరోయిన్ ని చూసినప్పుడు ఆమె అందాన్ని వర్ణిస్త్తూ.. కట్టు, బొట్టు ఎలా ఉందో చెప్తుంటాడు.
ఇదే టైంలో “ఆ అమ్మాయి ముక్కు పడక అదేంటో తన పెదవికి అందం తెచ్చింది” అంటాడు హీరో. ముక్కు పడక ముక్కుకు అందం తెస్తుంది కానీ పెదవికి అందం తేవడం ఏంటని ఈ డైలాగ్ ను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యం విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. సమ్మతమేలో ట్రోల్ చేయబడిన ఆ వీడియో లింక్ కింద ఇవ్వబడింది.
Watch video :
End of Article