“అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్ధమే..!” అంటూ… సింగర్ “శ్రావణ భార్గవి”పై ఆగ్రహం వ్యక్తం చేసిన “అన్నమయ్య” వంశస్థులు..!

“అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్ధమే..!” అంటూ… సింగర్ “శ్రావణ భార్గవి”పై ఆగ్రహం వ్యక్తం చేసిన “అన్నమయ్య” వంశస్థులు..!

by Anudeep

Ads

ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్నారు. ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’ అనే అన్నమయ్య కీర్తనని ఆమె ఆలపించి, దానికి అభినయం జోడించి ఓ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసారు. దీనిపై అన్నమయ్య వంశీకులు అభ్యంతరం తెలిపారు.

Video Advertisement

ఈ వీడియోలో పుస్తకం చదువుతూ, కాళ్ళు ఊపుతూ, తినుబండారాలు తింటూ కనిపించారు. అలా అసభ్యంగా అభినయించడం అన్నమయ్య కీర్తనని అపహాస్యం చేసినట్టే అని అన్నమయ్య వంశీకులు తాళ్ళపాక వెంకట రాఘవ అన్నమాచార్యులు విచారం వ్యక్తం చేశారు.

దీనిపై వివరణ కోరుతూ భార్గవికి ఫోన్ చేస్తే.. నిర్లక్ష్యంగా మాట్లాడారని వారు ఆరోపించారు. ఈ వీడియో వెంటనే డిలీట్ చేసి, క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పాటకు శాస్త్రీయ నృత్యం చేస్తే తప్పులేదు కానీ ఓ వివాహిత కాళ్లకు మెట్టెలు లేకుండా కనిపించడం సంప్రదాయం కాదని వారు ఆరోపించారు. దీనిపై శ్రావణ భార్గవి స్పందిస్తూ కాళ్ళు ఊపడంలో తప్పేముంది.. తాను ఓ బ్రాహ్మణ స్త్రీ నే సంప్రదాయాలు నాకు తెలుసు అని భక్తితోనే ఈ పాట పాడాను అని ఆమె అన్నారు. అలాగే వీడియో డిలీట్ చేయనని స్పష్టం చేశారు.

దీనిపై అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్ధమే..!” అంటూ… సింగర్ శ్రావణ భార్గవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు  అన్నమయ్య వంశస్థులు..! మొన్నటి వరకు శ్రావణ భార్గవి తన భర్తతో విడిగా ఉంటోందంటూ వార్తలు వచ్చాయి. ఆ మధ్య  హేమచంద్ర – శ్రావణ భార్గవి త్వరలో విడాకులు తీసుకుంటారంటూ పుకార్లు వచ్చాయి. వాటికి వారిద్దరూ అవునని కానీ, కాదని కానీ సమాధానం చెప్పలేదు. ఇది సద్దుమణగకముందే మరో వివాదంలో చిక్కుకున్నారు శ్రావణ భార్గవి. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది.


End of Article

You may also like