Ads
మనం ఫాలో అయ్యే, ఆరాధించే సెలబ్రెటీస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకప్పుడు ఎలా ఉండేవారు అని మనకు అనిపిస్తుంది. అలాగే అప్పుడప్పుడు కొంత మంది సెలబ్రెటీస్ రేర్ పిక్స్, చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.
Video Advertisement
అలాగే ఇప్పుడు మన దర్శకధీరుడు, జక్కన్న రాజమౌళి చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్ నెం.1 నుండి ఆర్ఆర్ఆర్ వరకు ప్రతి సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉన్నాడు. బాహుబలి సిరీస్‌తో ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసాడు.
తెలుగు వాడి సత్తాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రెప రెపలాడించాడు. కథ ఏదైనా, హీరో ఎవ్వరైనా సరే బాక్సాఫీస్ బద్దలు కావల్సిందే ఇదే జక్కన్నకు తెలిసిన సూత్రం. అలాగే ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా తెరకెక్కే చిత్రాన్ని పూర్తిగా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా మార్చేస్తున్నాడని సమాచారం. బాహుబలిని మించిన గ్రాఫిక్స్ తో ఈసారి రాజమౌళి మరో విజువల్ వండర్ ను తెరకెక్కించబోతున్నాడట.
మహేశ్ బాబు సినిమాకు సంబంధించి ఇంకా స్టోరీ సెట్ కాలేదని సమాచారం. అయితే ఏ స్కేల్లో ఈ మూవీ ఉండాలి, ఏ స్కేల్లో తెరకెక్కితే ఎంత తిరిగి రాబట్టవచ్చు అనేది ప్రస్తుతం రాజమౌళి లెక్కలు వేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్లో సినిమా ఉండబోతుందట. 2023 ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
End of Article