విజయ్ దేవరకొండ “లైగర్” ట్రైలర్‌లో… ఇది గమనించారా..?

విజయ్ దేవరకొండ “లైగర్” ట్రైలర్‌లో… ఇది గమనించారా..?

by Anudeep

Ads

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. పూరి కనెక్ట్స్ తో కలిసి కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. ట్రైలర్ చూస్తూ ఉంటే హీరో ఒక ఎంఎంఏ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు అని అర్థమవుతోంది. ఇందులో రమ్య కృష్ణ హీరో తల్లి పాత్రలో నటిస్తున్నారు.

Video Advertisement

శ్రీను వైట్ల దర్శకత్వంలో రాంచరణ్, రకుల్ ప్రీత్ జంటగా నటించిన బ్రూస్ లీ అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి అతిధి పాత్రతో అదరగొట్టేసాడు. ఇందులో చిరు కనిపించేది కాసేపే అయినా థియేటర్లు ఫ్యాన్స్ విజిల్స్ తో దద్దరిల్లిపోయాయి. అప్పుడే ఫ్లైట్ దిగి షూటింగ్ కోసం వచ్చిన చిరు, రకుల్ ప్రీత్ కష్టాల్లో ఉందని తెలిసి ఆమెను రక్షిస్తాడు.

minus points in vijay devarakonda liger trailer

ఆ సమయంలో మెగాస్టార్ చెప్పే డైలాగ్స్ అన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి. “జస్ట్ టైం గాప్ అంతే.. టైమింగ్ లో గాప్ ఉండదు” అంటాడు చిరంజీవి. అయితే ప్రస్తుతం లైగర్ ట్రైలర్ లో టైసన్ ను చూస్తుంటే.. బ్రూస్ లీ లో మెగాస్టార్ చిరంజీవి గుర్తొస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లైగర్ లో కూడా విజయ్ దేవరకొండ ఏదో గొడవ పడుతుంటే..

అప్పుడు ఎంటర్ అవుతాడు మైక్ టైసన్. నేను ఫైటర్ ని అని విజయ్ అంటే.. “నువ్వు ఫైటర్ అయితే.. మరీ నేనేంటి” అంటాడు టైసన్. మొత్తానికి ఒక్క ట్రైలర్ లోనే ఇన్ని సినిమాలు కనిపిస్తుంటే, ఒక సినిమా చూస్తే ఇంకెన్నీ సినిమాలు చూపిస్తాడో అని నెటిజన్ల సెటైర్లు వేస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పాన్ ఇండియా మూవీ లైగర్ ని తెరకెక్కిస్తున్నారు.

లైగర్ తెలుగు ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌ రిలీజ్ చేశారు. “ఒక లయన్ కి, టైగర్ కి పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ” అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ట్రైలర్ లో విజయ్ దేవరకొండ రఫ్ లుక్ లో కనబడుతున్నారు. చాన్నాళ్లుగా విజయ్ సినిమాలు కూడా ఏం రాకపోవడంతో రౌడీ ఫ్యాన్స్ నెల రోజుల ముందు నుంచే సంబరాల్లో మునిగిపోయారు. పూరీ కూడా ఇస్మార్ట్ శంకర్ హిట్ జోష్ లో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించాడు.


End of Article

You may also like