“కనిపించినంత గ్లామరస్ కాదు… ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి..!” అంటూ… వైరల్ అవుతున్న “మంచు విష్ణు” లెటర్..!

“కనిపించినంత గ్లామరస్ కాదు… ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి..!” అంటూ… వైరల్ అవుతున్న “మంచు విష్ణు” లెటర్..!

by Anudeep

Ads

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా మంచు విష్ణు, మనోజ్ ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చారు. మంచు విష్ణు శ్రీనువైట్ల డైరెక్షన్ లో ఢీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి అంతగా ఆకట్టుకోలేదు. ఇటీవల మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే..

Video Advertisement

మంచు విష్ణు నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. విష్ణు సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలను లైనప్ చేశాడు విష్ణు. వాటిలో శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఢీ అంటే ఢీ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా నూతన దర్శకుడు సూర్య డైరెక్షన్ లో జిన్నా సినిమా చేస్తున్నాడు.

ఈ మూవీలో సన్నీ లియోన్‌ కీలక పాత్ర పోషిస్టున్న సంగతి తెలిసిందే. అలాగే మెయిన్ హీరోయిన్ గా ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా మంచు ఫ్యామిలీ నుంచి మరోతరాన్ని సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేస్తుంది. మంచు విష్ణు కుమార్తెలు అరియాన, వివియాన త్వరలో వెండితెరపై సందడి చేయనున్నారు. విష్ణు హీరోగా చేస్తున్నా జిన్నాలో వీరిద్దరూ నటించనున్నారు.

అలాగే అందులో ఓ పాటను కూడా వీళ్ళే పాడనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విష్ణు ఓ నోట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఓ తండ్రిగా, నటుడిగా నా కుమార్తెలైన అరియాన, వివియానలను గాయనీమణులుగా, నటులుగా మీ ముందుకు తీసుకు వస్తున్నాను. నా రాబోయే చిత్రం జిన్నాలో అరియాన, వివియాన కలిసి ఒక పాట పాడారు.

ఆ పాటకు సంబంధించిన వీడియో సాంగ్ ఈ నెల 24న 11:13నిమిషాలకు రిలీజ్ చేయనున్నాం. వాళ్ళు నటీమణులు కావాలన్నదే నా కల కానీ వాళ్ళు ఏ మార్గం ఎంచుకుంటారు అనేది పూర్తిగా వాళ్ళిష్టం. వాళ్ళు మొదలు పెడుతున్నా ఈ ప్రయాణానికి మీ ఆశీస్సులు, అభినందనలు ఉంటాయని ఆశిస్తున్నా” ఓ పోస్ట్ పెట్టారు మంచు విష్ణు. విష్ణు చేసిన ఆ ట్విటర్ పోస్ట్ కింద ఇవ్వబడింది.


End of Article

You may also like