Ads
ప్రస్తుతం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం లైగర్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లైగర్ ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.
Video Advertisement
తాజాగా విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. మొదటి నుంచి ఈ సినిమా పై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది లైగర్ ట్రైలర్. విజయ్ మేకోవర్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్నాయి. ఇందులో విజయ్ తల్లిగా సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ కనిపించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న లైగర్ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నారు.
అలాగే ఇందులో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రలో విషు రెడ్డి నటించారు. విషు ఇంతకు ముందు మెహబూబా, త్రయం, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో నటించారు. లైగర్ లో అతను ఎంఎంఏ ఫైటర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. అలాగే విషు పూరీ, ఛార్మి కలిసి రన్ చేస్తున్న పూరీ కనెక్ట్స్ కి సీఈఓ గా కూడా పని చేస్తున్నారు.
విషు రెడ్డి లైగర్ సినిమా కోసం బానే కష్టపడ్డట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. విజయ్ కి ప్రత్యర్థిగా బాక్సింగ్ రింగ్ లో ఉంటారు విషు రెడ్డి. ఫైట్ స్టార్ట్ అవ్వడానికి విజయ్ మరియు విషు ఒకే రింగ్ లో ఒకరిని ఒకరు చాలా కసిగా చూసుకుంటారు. దీన్ని బట్టి విషు రెడ్డిది లైగర్ లో కీలక పాత్ర అని అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 25న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్, ఛార్మీ, పూరీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసేలా ఉంది. విజయ్ కూడా ముందు నుంచి ఈ మూవీతో దేశమంతా షేక్ అవుతుంది అని చెప్తూనే ఉన్నాడు.
End of Article