Ads
సీనియర్ హీరోయిన్ మీనా పరిచయం అవసరం లేని పేరు. మొన్న మధ్య వచ్చిన దృశ్యం సినిమాలో కూడా అద్భుతంగా నటించి అలరించారు. బాలనటిగానే కెమెరా ముందుకు వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఘనత మీనాది. ఇండస్ట్రీ కి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఆమె స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదు. పెళ్లి అయిన తరువాత సినిమాలకు కొంత కాలం పాటు దూరంగా ఉన్నప్పటికీ.. తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి దృశ్యం, పెద్దన్న వంటి సినిమాలతో అలరించిన సంగతి తెలిసిందే.
Video Advertisement
ఇటీవల మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందడంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. విద్యా సాగర్ గత కొంత కాలం నుండి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. మీనా, విద్యా సాగర్ 2009లో పెళ్లి చేసుకున్నారు. విద్యాసాగర్ తెలుగు కుటుంబానికి చెందినవారు.
అయితే భర్త మరణం తర్వాత తొలిసారి షూటింగ్ లో కెమెరా కంటికి చిక్కారు మీనా. జూలై 19న రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ సెట్స్ లో ఆయన కేక్ కట్ చేసారు. ఈ సినిమాలో మీనా కూడా నటిస్తున్నారు. ఈ వేడుకను అలీ భార్య జుబేదా కెమెరా లో రికార్డ్ చేసారు. ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసారు. ఈ క్రమంలో గతంలో తాను మీనాతో దిగిన చిన్ననాటి ఫొటోను కూడా షేర్ చేసారు. ‘పెళ్లాం చెబితే వినాలి’ సినిమా సమయంలో కలిశామని…మళ్ళీ ఇన్నాళ్లకు కలిశామని మీనాని కలవడంపై సంతోషం వ్యక్తం చేసారు జుబేదా.
ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ….చాలా కాలం తర్వాత తెలుగులో నటిస్తున్నాను అని… ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తొలిసారి యాక్ట్ చేస్తున్నానని తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
watch video:
End of Article