Ads
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా అల వైకుంఠపురంలో. 2020 మొదటిలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అల్లు అర్జున్ పర్ఫామెన్స్, త్రివిక్రమ్ డైలాగ్స్, తమన్ అందించిన సంగీతం, కొరియోగ్రఫీ ఇలా సినిమాలో ఉన్న ప్రతి అంశం ప్లస్ పాయింట్ అయ్యాయి. ఈ సినిమా పాటలు అయితే యూట్యూబ్ లో రికార్డుల సెన్సేషన్ సృష్టించాయి.
Video Advertisement
ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక సీన్ పై కామెంట్స్ వస్తున్నాయి. అదేంటంటే హీరోకి చిన్నప్పటి నుంచి కూడా నిజాలు చెప్పడం అలవాటు.
హీరో కొడుకుని తన కొడుకుతో మార్చిన హీరో తండ్రి పాత్ర పోషించిన మురళీ శర్మ ఒక అతని దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆ అప్పు కోసం ఆ వ్యక్తి హీరో వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు హీరో తన తండ్రి లేడు అని చెప్పకుండా లోపల ఉన్నాడు అని చెప్తాడు. తర్వాత హీరో తండ్రి మరోసారి అతను అప్పు డబ్బులు అడగడం కోసం వస్తే, తాను లేను అని చెప్పమంటాడు. అప్పుడు కూడా హీరో అబద్ధం చెప్పి దొరికిపోతాడు. అయితే ఇక్కడ హీరో తండ్రి ఒక డైలాగ్ చెప్తాడు.
“అన్నిటికీ నిజాలు ఎందుకు చెప్తావు? నువ్వేమన్నా రామచంద్ర కొడుకువా? అన్ని నిజాలు చెప్పడానికి?” అని అడుగుతాడు. సాధారణంగా నిజాలు చెప్పడం అంటే గుర్తొచ్చే వ్యక్తి సత్యహరిశ్చంద్రుడు. దాంతో మామూలుగా కూడా ఎవరైనా అన్ని నిజాలు చెప్పి ఉంటే వాళ్ళని, “నువ్వేమైనా సత్యహరిశ్చంద్రుడివా? అన్ని నిజాలే చెప్తావా?” అని అంటారు. లేదా “సత్యహరిశ్చంద్రుడి కొడుకువా? అని అంటారు. కానీ సినిమాలో మాత్రం హీరో తండ్రి పేరు రామచంద్ర. అదే అర్థం వచ్చేలాగా “నువ్వేమైనా రామచంద్ర కొడుకువా?” అని డైలాగ్ రాశారు. సినిమా కోసం ఇలా సింక్ చేసినా కూడా, “సాధారణంగా అయితే అలా వాడరు కదా?” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.
End of Article