Ads
సోషల్ మీడియాలో వచ్చాక అనేక వీడియోలు పోస్ట్ చేస్తుంటారు నెటిజన్లు. అందులో కొన్ని స్ఫూర్తిదాయకంగా ఉంటే, ఇంకొన్ని కడుపుబ్బా నవ్విస్తాయి, మరికొన్ని చూస్తే ఔరా అనిపిస్తాయి.. తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.అసలే ఇది వర్షాకాలం. ఈ సమయంలో రోడ్లన్నీ జలమయం.
Video Advertisement
రోడ్లపై నడిచేవాళ్లు జాగ్రత్తగా వెళ్లాలి. మ్యాన్ హోల్‌లో పడతామని కాదండోయ్.. మనపై బురద పడకుండా చూసుకోవాలి. కార్లు, బైకులు నడిపేవాళ్ల స్పీడ్ కు అడ్డు అదుపు ఉండదు. ఏదో రేసింగ్ లో పాల్గొన్నట్టు వర్షపునీటిలో కూడా ఫాస్ట్‌గా నడుపుతారు. అటుగా మనం వెళ్తే.. వాళ్లు ఎగజిమ్మే బురద నీరు మనపై చిందినట్లే.. అయితే ఇక్కడొక వ్యక్తి తెలివిగా ప్రవర్తించాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇంతకీ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి వర్షపు నీటిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక తన వెనకాల ఓ బైక్ హైస్పీడ్‌తో వస్తోంది. సరిగ్గా అతడి దగ్గరకు వచ్చేసరికి.. ఆ బైక్ స్పీడ్ తగ్గించాడు నడుపుతున్న వ్యక్తి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఈ నడుస్తున్న వ్యక్తి.. అతడిపై బురద పడకుండా ఓ పెద్ద రాయిని తన చేతిలో పెట్టుకుని నడుస్తున్నాడు. వర్షపు నీరు తన మీద పడకుండా ఈ వ్యక్తి చాలా తెలివిగా ఆలోచించాడు కదా! ఇంకెందుకు ఆలస్యం వైరల్ అవుతున్న ఆ వీడియో మీరు చూసేయ్యండి.
End of Article