Ads
తమిళ స్టార్ హీరో, సింగర్ ధనుష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇంతవరకు డైరెక్ట్ తెలుగు సినిమాల్లో నటించని ధనుష్ కేవలం డబ్బింగ్ సినిమాలతో మాత్రమే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
Video Advertisement
2002లో తుళ్లువదో ఇలామైతో నటుడిగా అరంగేట్రం చేసిన ధనుష్, రెండు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోగా ఉన్న ధనుష్ మొదట్లో తన లుక్స్ వల్ల ఎలా ట్రోల్ అయ్యాడో మీకు తెలుసా? ఆఖరికి అతని స్వంత సిబ్బందే అతనిని బాడీ షేమ్ చేసేవారట.
2015లో విజయ్ సేతుపతి, అనిరుధ్ రవిచందర్ మరియు సతీష్‌లతో జరిగిన ఇంటరాక్షన్‌లో ధనుష్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ.. మారన్ స్టార్ తన 2003లో విడుదలైన కాదల్ కొండేన్ సెట్స్‌లో ఉన్న సిబ్బంది తన రూపాన్ని ఎగతాళి చేశారని, తనను “ఆటో డ్రైవర్” అని హేళన చేసేవారని తెలిపాడు. దీంతో అతను తన కారు వద్దకు వెళ్లి గట్టిగా అరిచాడట.
“కాదల్ కొండెన్ షూటింగ్ చేస్తున్నప్పుడు, హీరో ఎవరని నన్ను అడిగే వారని, అవమానాలు ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా లేనందున నటీనటులలో వేరొకరికి చూపించాను. అయితే.. ఆ తర్వాత వారికి నిజం తెలియడంతో నేను హీరో అని సెట్స్‌లో ఉన్న వాళ్లంతా నన్ను చూసి నవ్వారు. ‘ఏయ్ ఆటో డ్రైవర్ చూడు.. అతనే హీరో’ అన్నారు.
నేను ఈ అవమానాన్ని తట్టుకోలేక గట్టిగా ఏడ్చాను. నన్ను ట్రోల్ చేసి బాడీ షేమ్ చేయని వ్యక్తంటూ లేడు అంటూ అప్పటి విషయాలు చెప్పుకొచ్చాడు ధనుష్. ప్రస్తుతం ధనుష్ తెలుగు డైరెక్ట్ మూవీ ‘సార్’ లో నటిస్తున్నారు. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు తమిళ భాషల్లో రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ధనుష్ ఒక ముఖ్య పాత్రలో నటించిన హాలీవుడ్ సినిమా ద గ్రే మ్యాన్ ఇటీవల విడుదల అయ్యింది. ఇది మాత్రమే కాకుండా ధనుష్ ఇంకా కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
End of Article