Ads
మొన్న విశాఖపట్నం ఆర్కేబీచ్లో గల్లంతయ్యారు అని భావించిన సాయిప్రియ, ఆ తర్వాత నెల్లూరులో ప్రియుడి దగ్గర ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే అదే సమయంలో సాయిప్రియ తన తండ్రికి వాట్సప్ వాయిస్ మెసేజులు పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Video Advertisement
ఈ మేసేజులు పంపడానికి 2 రోజుల ముందు, అంటే జులై 25న సాయిప్రియ, శ్రీనివాసరావుల పెళ్లి రోజు. ఆ రోజు సాయంత్రం ఆర్కే బీచ్‌కు భార్యభర్తలు వచ్చారు. కాసేపు అక్కడ గడిపి, తిరిగి ఇంటికి వెళ్దామనుకునేసరికి సాయి ప్రియ కనిపించలేదు. తన భార్య కనిపించడం లేదంటూ శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సాయిప్రియ బీచ్‌లో గల్లంతై ఉంటారని భావించిన అధికారులు సెర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టారు. సాయిప్రియ మిస్సింగ్ కేసుకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు. పోలీసులు ఏం చెప్పారంటే.. సాయిప్రియ, విజయవాడకు చెందిన శ్రీనివాసరావులకు 2020 జూలై 25న వివాహం అయింది. శ్రీనివాసరావు హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలో పని చేస్తుంటారు. జులై 25, పెళ్లి రోజని ఆర్కే బీచ్ కి వెళ్తే..
అక్కడ తన భార్య కనిపించడం లేదని శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు. భర్త ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. సాయిప్రియ సముద్రపు నీటిలో కొట్టుకుపోయారేమో అని కోస్ట్‌గార్డ్ సిబ్బంది హెలికాప్టర్లు, స్పీడ్ బోట్లతో ఆర్కే బీచ్ లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. అయితే గాలింపు చర్యలు కొనసాగుతుండగానే సాయిప్రియ నెల్లూరులో ఉందని తెలియచేస్తూ తనకు ఫోన్ సమాచారం అందిందని డిప్యూటీ మేయర్ శ్రీధర్ తెలిపారు.
జులై 27, సాయంత్రం 7.30 గంటలకు సాయిప్రియ తన తండ్రికి వాట్సాప్‌లో కాంటాక్ట్ అయ్యారు.. నాన్నా నేను బతికే ఉన్నాను. రవితో నాకు పెళ్లయిపోయింది”. తాను బెంగళూరులో ప్రియుడు రవిని పెళ్లి చేసుకున్నానని, తన కోసం వెతకొద్దని చెప్తూ వాయిస్ మెసేజ్ ను, తన మెడలో తాళిబొట్టు ఉన్న ఒక ఫోటోను కూడా వాట్సాప్‌లో షేర్ చేశారు. వాటిని సాయిప్రియ తల్లిదండ్రులు విశాఖ త్రీ టౌన్ పోలీసులకు అందచేశారు.
watch video :
End of Article