Home Filmy Adda సూపర్ హిట్ “సీతారామం” సినిమాలో ఛాన్స్ వదులుకున్న ఈ స్టార్ హీరో ఎవరో తెలుసా?

సూపర్ హిట్ “సీతారామం” సినిమాలో ఛాన్స్ వదులుకున్న ఈ స్టార్ హీరో ఎవరో తెలుసా?

by Anudeep

డబ్బింగ్ సినిమాలు తో తెలుగు తెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ మహానటితో కొంత క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు మూవీ అయిన సీతారామం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరయ్యాడు. ఇప్పటివరకు అతను నటించిన చిత్రాలలో మహానటి తప్ప మిగతా ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సాధించ లేకపోయింది. కానీ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి దుల్కర్ సల్మాన్ కంటే ముందు డైరెక్టర్ అప్రోచ్ అయిన తెలుగు హీరో ఎవరో తెలుసా…మరి ఎవరో కాదు విజయ్ దేవరకొండ. తన బిజీ షెడ్యూల్ కారణంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాని వదులుకొని ఉంటాడు అని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అటు మరికొందరు అతను ఈ సినిమా లో ని లెఫ్టినెంట్ రామ్ పాత్ర తనకు సూట్ కాదు అన్న ఉద్దేశంతో వదులుకొని ఉంటాడు అని కామెంట్ చేస్తున్నారు.

sita ramam movie review
కారణం ఏదైనాప్పటికీ లెఫ్టినెంట్ రామ్ పాత్ర కు దుల్కర్ సల్మాన్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని అందరూ అభిప్రాయ పడుతున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సీతారామం సినిమా రికార్డు స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతుందని అంచనా. ఈ సినిమా సక్సెస్ లో రష్మిక మందాన తన వంతు కీలకపాత్రను పోషించారని అభిప్రాయపడుతున్నారు.

does these things become plus points for vijay devarakonda liger movie

ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో దుల్కర్ సల్మాన్ కు తెలుగులో ఆఫర్లు పెరిగే అవకాశం ఉందని అంచనా. అంతే కాదు చిత్రంలో నటించి తన నటనతో అందరిని మేపించిన మృణాళ్ ఠాకూర్ కి సైతం సౌత్ మూవీస్ నుంచి కొత్తగా ఆఫర్స్ వస్తున్నాయని వినికిడి.

You may also like