Home Filmy Adda “మాచర్ల నియోజకవర్గం” OTT లో విడుదలయ్యేది అప్పుడేనా..? ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

“మాచర్ల నియోజకవర్గం” OTT లో విడుదలయ్యేది అప్పుడేనా..? ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

by Anudeep

యస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా కృతి శెట్టితో జంట కట్టిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈనెల 12న రిలీజ్ అయి ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా అంతంత మాత్రంగానే ఉంది అన్న టాక్ వచ్చింది.

ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ మూవీ అంచనాలకు తగినట్టుగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం ద్వారా ఆయన సక్సెస్ సాధించాలి అని ప్రయత్నించిన నితిన్ ను ఈ మూవీ నిరాశపరిచిందని చెప్పవచ్చు.

macherla niyojakavargam movie review

ఈ సినిమాలో అవినీతిపరులైన రాజకీయ నాయకుల తో పోరాడే కలెక్టర్ పాత్రలో నటించిన నితిన్ నటన పలువురి ప్రశంసలు అందుకుంది. కానీ కొన్ని కారణాలవల్ల ఈ చిత్రం అనుకున్న సక్సెస్ సాధించలేకపోవడం నితిన్ ఫాన్స్ కు నిరాశ మిగిల్చింది. ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు వెంటనే ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లో కూడా విడుదలై ప్రేక్షకులకు కనువిందు చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ సొంతం చేసుకుంది.

macherla niyojakavargam movie review

మామూలుగా సినిమా హిట్ అయినట్లయితే ఓటీటీ లో కొద్దిగా ఆలస్యంగా రిలీజ్ చేసేవారే, కానీ ఈ చిత్రం విడుదలైన అనంతరం ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇది త్వరలోనే ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ లో రిలీజ్ అవుతుందని అంచనా. మాచర్ల నియోజకవర్గం విడుదలై నాలుగు వారాలు కూడా కాకముందే అమెజాన్లో ప్రసారం చేయబోతున్నట్లు సమాచారం. మరి రిలీజ్ డేట్ ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నారా…ఈ సినిమా అమెజాన్ లో సెప్టెంబర్ 9 నుంచి ప్రసారం కాబోతుంది అని తెలుస్తుంది. కానీ ఇంకా దీనికి ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఈ విషయాన్ని ఎంతవరకు నమ్మవచ్చు అనేదానిమీద ఇంకా క్లారిటీ కలగలేదు.

You may also like