Ads
ఒకప్పుడు హీరోయిన్లకి అంతగా రెమ్యునరేషన్ ఉండేది కాదు అనేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతీ హీరోయిన్ కి బోలెడంత డిమాండ్ ఉంటుంది. అదే ఛాన్స్ గా తీసుకుని, హీరోయిన్లు కూడా తమ రెమ్యునరేషన్ గట్టిగానే పుచ్చుకుంటున్నారట. కానీ లైగర్ సినిమాలోని హీరోయిన్ అనన్య కి మాత్రం అలా జరగలేదు.
Video Advertisement
ఈ తరుణంలో తాజాగా వినిపిస్తున్న లైగర్ మూవీ హీరోయిన్ అనన్య పాండే గురించే అనేకానేక చర్చలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఈ సినిమాకి తను రెమ్యునరేషన్ ఎంత తీసుకొని ఉండొచ్చు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో అనన్యకి అన్యాయం జరిగింది అనే టాక్ కూడా నడుస్తోంది.
అయితే ఈ సినిమాని మొత్తం 100 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అందులో విజయ్ దేవరకొండకి దాదాపు 20 నుండి 30 కోట్లు ఇచ్చారట. మరోపైవు ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ మైక్ టైసన్ కి కూడా భారీ రెమయునరేషన్ ఏ ఇచ్చారని తెలుస్తోంది. కానీ అనన్య విషయంలో మాత్రం రెమ్యునరేషన్ తగ్గింది.కేవలం 3 కోట్ల రూపాయలు ఇచ్చరాని వెల్లడయ్యింది. దీంతో ఇంత కాలం తర్వాత కూడా హీరోలకే ఎక్కువ రెమ్యునరేషన్ ఆ, హీరోయిన్లు అంటే చిన్న చూపా అంటూ టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే అనన్య మాత్రం రెమ్యునరేషన్ తో సంబంధం లేకుండా సినిమా కోసం అనేక పాట్లు పడిందట. ఒకరకంగా చెప్పాలంటే తన నటన, గ్లామర్ తో అభిమానుల మనసులను కొల్లగొడతుందట.
ఇప్పటికీ ఆగస్ట్ 25 న రిలీజ్ అయ్యే ఈ సినిమా కోసం, ప్రమోషన్స్ తారా స్థాయిలో జరుగుతుండగా…త్వరలో విడుదల కానున్న లైగర్ మూవీ తెగ హడావిడి చేస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకి నటి ఛార్మి, పూరి జగన్నాథ్ సహ నిర్మాతలు అవ్వడం విశేషం.
End of Article