Ads
గోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన ఒక సంఘటన కలకలం సృష్టించింది. ఆ సంఘటన పలు చర్చలకు దారి తీస్తోంది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే, సాక్షి కథనం ప్రకారం గత వారం నుండి కనిపించకుండా అదృశ్యమైన మంథా సాయి శ్రీజ ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. కోరంగి ఎస్సై టి.శివకుమార్ కథనం ప్రకారం….. తూర్పుగోదావరి మండలం నీలపల్లికి చెందిన శ్రీజ 2 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. కానీ గత కొన్ని రోజులుగా భార్యాభర్తలు ఇద్దరు మధ్య మనస్పర్ధలు రావడంతో వేధింపులు భరించలేని ఆమె కాకినాడ దిశా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Video Advertisement
ఈ మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని తమ వంతు దర్యాప్తు మొదలుపెట్టారు. మరోపక్క శ్రీజకు వెంకీ ,సాయి అనే ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. కానీ తరవాత ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు కానీ వారి పరిచయం బెడిసి కట్టింది. గత కొంతకాలంగా వారితో కూడా ఆమెకు మనస్పర్ధలు వచ్చాయి.ఆ ఇద్దరి యువకుల వేధింపుల కారణంగా మనోవేదన కు గురి అయిన తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఉత్తరంలో పేర్కొంది.
తన తల్లిదండ్రులతో వైజాగ్ లో కళాపరిషత్ లో ఉద్యోగం వచ్చిందని చెప్పిన శ్రీజ, కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత తిరిగి వస్తానని ఇంటి నుంచి కొంత నగదు తీసుకొని వెళ్ళిపోయింది.ఆమె వెళ్లిన తర్వాత వెలుగులోకి వచ్చిన సూసైడ్ నోట్ చూసి ఆమె తల్లిదండ్రులు కలత చెందుతున్నారు. పోలీసులు యానం , కోరంగి వద్ద గోదావరిలో విస్తృతంగా గాలించారు, అయినప్పటికీ ఇంతవరకు ఆమె ఆచూకీ తెలియలేదు.
representative image
ఇల్లు వదిలిపెట్టి వెళ్లి ఇన్ని రోజులు గడిచిన ఇంకా తమ కూతురి ఆచూకీ తెలియలేదని తల్లడిల్లి పోతున్నారు. ఇదిలా ఉండగా వెంకీ ,సాయి అనే ఆ ఇద్దరి యువకుల కారణంగానే తమ కుమార్తె జీవితం ఇలా నాశనం అయ్యిందని శ్రీజ తల్లిదండ్రులు ఆరోపించారు. వారి వేధింపులు భరించలైకే తమ కుమార్తె సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా మాయమైపోయిందని విలపించారు. కాబట్టి వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి అని కోరారు.
End of Article