డైరెక్టర్ “మారుతి” ని బాయ్‌కాట్ చేయాలా..? అసలు ఇది ఎందుకు ట్రెండ్ అవుతోంది..?

డైరెక్టర్ “మారుతి” ని బాయ్‌కాట్ చేయాలా..? అసలు ఇది ఎందుకు ట్రెండ్ అవుతోంది..?

by Anudeep

Ads

బాలీవుడ్ లో నిన్నటి వరకు ట్రెండింగ్ ఫ్యాషన్ గా నడిచిన పదం బాయ్ కాట్. కానీ ఇప్పుడు అది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా మారుమోగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలోనే మారుతితో కలిసి ఒక చిత్రంలో నటించిన ఉన్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. అసలు మారుతి కి తంటా అంతా దీనివల్ల స్టార్ట్ అయింది.

Video Advertisement

మారుతి “ఈ రోజుల్లో” అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అందరి దృష్టిని తన వైపు ఆకర్షించారు. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన రెండవ చిత్రం బస్ స్టాప్. ఇవి రెండూ పెద్ద సక్సెస్ను అందివ్వ లేక పోవడంతో కొంతకాలం ఆయన సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నారు.ఆ తరువాత కొత్తజంట, బలే బలే మగాడివోయ్ సినిమాల లో మునుపెన్నడూ లేనటువంటి కొత్త కాన్సెప్ట్స్ తో కామెడీతో సక్సెస్ అందుకున్నాడు.

ఇదే క్రమంలో ఆయన ఇటీవల తీసిన పక్కా కమర్షియల్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పక్కాగా బోల్తా పడింది. అయితే ప్రస్తుతం తమ డార్లింగ్ ప్రభాస్ మారుతీతో చిత్రం చేస్తున్నాడు అనేది ప్రభాస్ ఫ్యాన్స్ కు రుచించలేదు. ప్రభాస్ మారుతి కొత్త సినిమా లాంచ్ అవ్వబోతున్న ఈ తరుణంలో రంగంలోకి దిగిన ప్రభాస్ ఫ్యాన్స్ #BoycottMaruthiFromTFI అనే హాష్ టాగ్ ను చాలా పాపులర్ చేశారు. అది చాలదన్నట్టు అసలు ఇప్పుడు ఈ సినిమా అవసరమా? వద్దనే వద్దు. అంటూ వినూత్న శైలిలో మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

prabhas

ఆల్రెడీ కొద్దికాలం నుంచి ప్రభాస్ కు పెద్దగా లక్ కలిసి రావడం లేదు. బాహుబలి తరువాత ప్రభాస్ తిరిగి అంత సక్సెస్ అందుకో లేకపోయాడు. పైగా ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సాహో,రాధేశ్యామ్‌ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టలేక డీలపడ్డాయి. దాంతో ఇప్పటికే బాగా నీరసించిన ప్రభాస్ ఫ్యాన్స్ ఇటీవల ఫ్లాప్ టాక్ అందుకున్న డైరెక్టర్ మారుతీ తో ప్రభాస్ నెక్స్ట్ మూవీ అని తెలిసి ఈ రచ్చ మొదలుపెట్టారు.


End of Article

You may also like