Ads
బడా హీరో – డైరెక్టర్ కాంబినేషన్లో వచ్చే మూవీ అంటే చాలు తౌసెండ్ వాలా పీలినట్టే అని ఫీల్ అవుతారు ప్రేక్షకులు. కానీ అది చివరకు తుస్సుమనడంతో, కంగు తింటారు. అబ్బా ఏదో అనుకున్నాం కానీ, ఇంత ఖర్చు మ్యాటర్ పెద్దగా లేదురా అనే అభిప్రాయానికి వస్తారు. అయితే తాజాగా విడుదల అయిన పెద్ద డైరెక్టర్, బడా హీరో సినిమాలపై అలాంటి ఆశలే పెట్టుకున్న అభిమానులకి, చివరిలో నిరాశే మిగిలింది. ఇక ఆ కోవకు చెందిన 8 సినిమాలపై ఓ లుక్కేద్దాం.
Video Advertisement
#1. నితిన్ & చంద్ర శేఖర్ యేలేటి – చెక్
నితిన్ సినిమా అనగానే, కచ్చితంగా అందులో కిక్కిచ్చే కాన్సెప్ట్ ఉంటుందని భావిస్తారు అభిమానులు. అలా వూహించిన సినిమానే చెక్. కానీ ఈ సినిమా టీజర్ తో ఊరట పెంచినప్పటికీ… ఫుల్ మూవీ చూశాక అయిపాయ్ అనిపించింది. కొన్ని లాజిక్స్ miss అవ్వడంతో తియ్యాలి అనుకున్న కాన్సెప్ట్ సరిగ్గా చిత్రీకరించలేకపోయారు.
#2. రవితేజ & రమేష్ వర్మ – ఖిలాడి
మాస్ మహారాజా ఫ్యాన్స్ కి గ్యాప్ ఇవ్వకుండా, వరసగా సినిమాలు తియ్యడంలో బిజీగా ఉన్నాడు హీరో రవి తేజ. మరోవైపు రాక్షసుడు సినిమాతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ రమేష్ వర్మ రవితేజ కాంబినేషన్ లో క్రాక్ సినిమాతో, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ బ్రేక్ ఇచ్చాడు. అలానే ఖిలాడీతో హిట్ ఇచ్చి దూసుకెల్లాలి అనుకున్నాడు. కానీ డిజాస్టర్ తో బ్రేక్ పడింది.
#3. అజయ్ భూపతి & శర్వానంద్ – మహా సముద్రం
Rx100 తో సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి, మహా సముద్రంతో బ్లాక్ బస్టర్ ఇస్తాడు అని ఊహించారు సినీ అభిమానులు. సినిమా ప్రీ లిరీజ్ ఈవెంట్ లో అయితే సిద్దార్థ్ రీ ఎంట్రీ తో పాటు, ప్రతీ నటులు చెప్పిన స్పీచులు చూస్తే మహా సముద్రం సినిమాపై అంచనాలు, అంబరాన్ని అంటాయి. కానీ చివరిలో సినిమా కథలో కొత్తదనం లేకపోవడం, కొద్దిగా ల్యాగ్ అనిపించడంతో డిజాస్టర్ అయ్యిందని మూవీ చూసినా వాళ్లంతా చర్చించుకున్నారు.
#4. మారుతి & గోపీచంద్ – పక్కా కమర్షియల్
ఈ సినిమా మంచి కామెడీతో, అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది అనుకున్నారు ఆడియన్స్. కానీ మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది అన్నట్టు… ఈ సినిమా కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయి ఫ్లాప్ అయ్యింది. కారణాలు ఏవైనా ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.
#5. చిరంజీవి & కొరటాల శివ – ఆచార్య
ఇక ఈ సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాస్ మూవీ అంటే పడి చచ్చిపోతారు చిరు ఫ్యాన్స్. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ తర్వాత, తండ్రితో తీసే సినిమా ఏ రేంజులో హిట్ అవుతుందో అని మరింత ఆశ పెంచుకున్నారు మెగా అభిమానులు, సినీ అభిమానులు. కానీ సినిమా స్టోరీ సరిగ్గా చూపించకపోవడంతో పాటు, కొన్ని లాజిక్స్ మిస్స్ అయ్యాయి అనే టాక్ వచ్చింది. అంతే కాకుండా ఇద్దరు సూపర్ హీరోల టైం దొరిినప్పుడు, డైరెక్టర్ మంచి కాన్సెప్ట్ తీసుకోవాల్సింది అని, ఇంత మంచి ఛాన్స్ వేస్ట్ చేసాడనే కామెంట్లు కూడా వినిపించాయి. అలా ఈ సినిమా మెగా డిజాస్టర్ గా మారింది.
#6. రామ్ & లింగుస్వామి – ది వారియర్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమా అంటే మామూలుగా ఉండదు అనుకున్నారు ఫ్యాన్స్. అందులోనూ ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు అనే ఆతృతతో, తెగ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఒక అర్థం పర్థం లేని ఎజెండాతో సినిమా బెడిసికొట్టింది అంటున్నారు. డాక్టర్ నుండి పోలీస్ ఆఫీసర్ గా మారడం అంత ఈజీ పనా? అయినా ఒక లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు, ఏంటి రామ్ ఇలా తీశాడు సినిమా అంటూ అభిమానులు నిరాశ చెందారు.
#7. రవితేజ & శరత్ మందావ – రామారావ్ ఆన్ డ్యూటీ
మాస్ మహారాజా వరస ఫ్లాపుల తర్వాత అయినా, హిట్ ఇస్తాడు అనుకుంటే ఇది కూడా డిజాస్టర్ అయిపోయింది. పైగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి రావడం, ఆయన మాట్లాడటం చూసి ఇది పక్కా హిట్ అని ఫిక్స్ అయ్యారు అభిమానులు. కానీ హిట్ కాదు కదా, వీరబలి సినిమా అని, స్టొరీ కూడా కొత్తగా ఏం లేదు ఎన్ని సార్లు ఇలాంటి సినిమాలు తీస్తారు అనే టాక్ వచ్చింది.
#8. విజయ్ దేవరకొండ & పూరి జగన్నాథ్ – లైగర్
ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఒకటి రెండు కాదు వంద రకాలుగా ఉన్నాయి. ముందుగా సినిమా పోస్టర్ తో మొదలు పెడితే, సాంగ్ రిలీజ్ వరకు ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. విజయ్ ను ఒక ప్లేయర్ గా చూడటం అదీ పూరీ సినిమాలో అంటే సీన్ సితార్ అయిపోద్ది అనుకున్నారు. ప్రమోషన్స్ నడుస్తున్నంత కాలం సినిమా ఎప్పుడూ విడుదల అవుతుందా అని చూసారు. కానీ చివరికి డిజాస్టర్ అవుతుంది అని ఊహించలేక పోయారు. మరీ ముఖ్యంగా అసలు ఇది పూరీ జగన్నాథ్ సినిమానా? ఎక్కడా కూడా పూరి స్టైల్, కిక్ ఇచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్, హీరో స్వాగ్ ఇవన్నీ ఎక్కడా? అంటూ వాపోయారు. ఏ రకంగా చూసినా అంచనాలను చేరుకోలేక పోయింది.
ఇలా ఎంతో ఆసక్తిగా, బడా డైరెక్టర్ అండ్ పెద్ద హీరోల కాంబినేషన్స్ లో వచ్చిన ఈ సినిమాలు ఆడకపొగా, నిరాశ మిగిల్చాయి అనే చెప్పొచ్చు.
End of Article