“అతిధి” హీరోయిన్ గుర్తుందా.? ఆమె రియల్ లైఫ్ గురించి ఈ విషయాలు తెలుసా.?

“అతిధి” హీరోయిన్ గుర్తుందా.? ఆమె రియల్ లైఫ్ గురించి ఈ విషయాలు తెలుసా.?

by Mohana Priya

Ads

అసలు సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక విభిన్న ప్రపంచం. అందులోనూ సినీ పరిశ్రమకు చెందిన వారి పెళ్లి అంటే ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతుంది. అసలు ఒక నటి కానీ, నటుడు కానీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఆత్రుత ఎక్కువగా ఉంటుంది ప్రేక్షకులకు. పోనీ చేసుకున్నారే అంటే అసలు కలిసి ఉంటారా అనే భావన కూడా ఉంటుంది.

Video Advertisement

ఒకరకంగా చెప్పాలంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవడం విడిపోవడం, డేటింగ్ చెయ్యడం బ్రేక్ అప్ చెప్పడం చాలా చాలా కామన్ అనే ఫీలింగ్ కి వచ్చేశారు చాలా మంది. డేటింగ్ చేసిన ప్రతీ ఒక్కరితో పెళ్లి అవ్వదూ. పెళ్ళైన వారితోనే జీవితం గడవదు అనే అభప్రాయం కూడా ఉంది.

అయితే అతిథి సినిమా హీరోయిన్ అమృత రావుకి కూడా తన గురించి, తన రిలేషన్ గురించి అలాంటి సందేహమే ఉండేదట. తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని షాకింగ్ విషయాలను తెలిపింది. సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఈ ముద్దుగుమ్మ మాటలు, ఇప్పుడు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.కాగా తాను కొన్నేళ్ల క్రితం నటుడు అన్మోల్ తో డేటింగ్ చేసిందట. కానీ ఆ డేటింగ్ కాలం ఎన్నో రోజులు కొనసాగదని, అతను అమృత రావు ను వొదిలేస్తాడేమో అని భావించిందట. కానీ తను అనుకున్న ఆలోచన తప్పు అయ్యింది. వాళ్ళ ఇద్దరు మధ్య ప్రేమ చిగురించి. ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారి తీసింది. అలా 2014లో నటి అమృత రావు, నటుడు అన్మోల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అలా తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపేవారట.

ఇటీవల కాలంలో తమ జీవితంలో జరిగే ప్రతీ విషయాన్ని, యూట్యూబ్ ద్వారా పంచుకుంటూ… పెళ్ళైన 10 సంవత్సరాల వరకు వాళ్ళు ఇద్దరు ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా, ఎలాంటి బేధాలు లేకుండా, ఒకరి మీద ఒకరు గౌరవంతో నడుచుకునే వారట. దాదాపు ప్రతీ విషయంలోనూ ఇద్దరు ఒకేలా ఆలోచించే వారట. కొన్ని సార్లు అన్మోల్ ఏ బాగా ఆలోచిస్తాడు అని కూడా చెప్పింది నేటి అమృత రావు. అంతా బాగానే ఉంది, జీవితం సాఫీగా ఉంది, ఎలాంటి గొడవలు లేవు. ఇద్దరి ప్రేమకు చిహ్నంగా వారికి ఒక కొడుకు పుట్టాడు. ఇద్దరు కాస్త ముచ్చటగా ముగ్గురు అయ్యారు.

అక్కడే జీవితం కొంత మారినట్టు అనిపించిందట అమృతకి. తన కొడుకు విషయంలో వాళ్ళ ఇద్దరికీ గొడవలు అవ్వడం మొదలయ్యాయి అంట. కొడుకుని అన్మోల్ కి న చినట్టు పెంచాలి అనుకుంటాడు, నా మాట అసలు వినడు అంటూ… ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో తనకు రెండో బిడ్డను కనాలి అంటే కూడా భయమేస్తోంది అని కూడా చెప్పుకొచ్చింది అమృత.

ఇక దీన్ని చూసి, ఏమ్ కాదు కొద్ది రోజులు అలా ఉన్నా… తర్వాత జీవితం బాగుంటుంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలియజేశారు. తాజాగా ఈ దంపతులు పెద్దల సమక్షంలో మరో సారి పెళ్లి చేసుకున్నారు. ఆ ఫోటోలు , వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


End of Article

You may also like