Ads
సినీ రంగంలో ప్రవేశించారు అంటేనే నటన మీద ఆసక్తి, ఫేమస్ అవ్వాలనే తపన, ఈ రెండింటితో పాటు ముఖ్యంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన. కానీ కేవలం నటన ద్వారా డబ్బు సంపాదిచలేము అనే ఆలోచనతో, విభిన్న రంగాలలో కూడా వచ్చిన మనీని ఇన్వెస్ట్ చేస్తుంటారు కొందరు ఆర్టిస్టులు. అలా సినిమా ద్వారా వచ్చిన డబ్బుని మళ్లీ సినిమాల పైనే ప్రొడ్యూజర్ గా మారి పెట్టుబడి పెడుతుంటారు.
Video Advertisement
కాకపోతే ఏ సినిమా ఎప్పుడు హిట్ అవుతుందో.. ఎప్పుడు ఫట్ అవుతుందో అంచనా వేయలేం. ప్రతీ సినిమా ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి కాన్సెప్టులు నచ్చుతాయో కూడా చెప్పలేం. సరేలే ఏదైతే అది అయ్యింది అనే ధైర్యంతో, సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తుంటారు. అలా కొందరు నటీమణులు కొన్ని సినిమాలపై ప్రొడ్యూస్ చేసి, భారీగా నష్టపోయారు. ఆ కోవకు చెందిన పది మంది హీరోయిన్లు వీళ్ళే.
1. సావిత్రి
నటనకు, పట్టుదలకు, మంచితనానికి పెట్టిన మారుపేరు సావిత్రి. నటి సావిత్రి అంటే అభిమానించని వ్యక్తి అంటూ ఉండరు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వంటి ఎందరో పెద్ద పెద్ద హీరోలు కూడా సావిత్రి డేట్స్ కోసం ఎదురు చూసే అంత గొప్ప నటి సావిత్రి. అయితే నటి నుండి నిర్మాతగా మారిన సావిత్రి చిన్నారి పాపలు అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో దాదాపు లక్షల్లో నష్టపోయారు. ఇప్పటి కాలంతో పోల్చుకుంటే 100 కోట్లు నష్టపోయారనే చెప్పొచ్చు.
2. జయసుధ
ప్రసిద్ధ పేరుగాంచిన నటి జయసుధ. ఇప్పటి వరకూ సినీ రంగంలో తనదైన ముద్రను వేసుకుంటూ వెళుతున్నారు. మరోవైపు కాంఛన సీత, కలికాలం, అదృష్టం, వింత కోడళ్ళు వంటి సినిమాలను నిర్మించారు. కానీ ఈ సినిమాలతో, ఆమెకు అదృష్టం వరించకపోగా, భారీ నష్టంతో కలికాలం వచ్చినట్టు అయ్యింది.
3. భూమిక
నాకు తెలుసు నువ్వు చూసావ్, నువ్వు చూసావ్. అదే భూమిక పేరు వింటే గుర్తొచ్చే డైలాగులు అవే కదా.ఖుషి, ఒక్కడు ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. మిస్సమ్మ మూవీతో 2003లో ఉత్తమ నటి అవార్డును కూడా పొందారు. ఇక తకిట తకిట మూవీని నిర్మించగా, దాదాపు కోటి రూపాయలకి పైగా నష్టపోయారు.
4. కళ్యాణి
ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తో అందరికీ చేరువైన కళ్యాణి, మరెన్నో సినిమాల్లో తన మరపు రాని నటనా ప్రతిభను కనబరిచింది. ఇకపోతే ఈమె K2K ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి, అందులో ద్విభాషా చిత్రాన్ని నిర్మించారు. కానీ అది అంతగా ఫలించకపోవడంతో, నష్టపోయారు.
5. విజయ శాంతి
ఈ పేరు వింటే ఏ తరం వారికి అయినా విబ్రేషన్స్ వస్తాయి. లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అనే గొప్ప పేరును సంపాదించుకున్నారు విజయశాంతి. సుమారు 180 సినిమాల్లో తన నటన ప్రతిభతో రాఫ్ఫాడించారు. తెలుగు తో పాటు అనేక భాషల్లో కూడా సినిమాలు చేశారు. మంచి ఫామ్ లో ఉన్నప్పుడే, నిప్పు రవ్వ అను బాలయ్య సినిమాను నిర్మించి నష్టపోయారు.
6. మంజుల ఘట్టమనేని
సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మంజుల ఘట్టమనేని అనేక సినిమాల్లో నటించారు. షో మూవీలో నటించడంతో పాటు, నిర్మాతగా కూడా వ్యవహరించారు. అంతే కాకుండా కావ్యాస్ డైరీ, మహేష్ బాబు నాని చిత్రాలను కూడా నిర్మించి భారీగా నష్టపోయారు.
7. రోజా
రోజా గురించి స్పెషల్ గా చెప్పే పనిలేదు అనుకుంట. అనేక భాషల్లో 100 సినిమాలకు పైనే నటించారు. తరువాత ఆమె భర్త డైరెక్ట్ చేసిన సమరం అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. కానీ దానితో తీవ్ర నష్టాన్నే ఎదురుకొన్నారు.
8. శ్రీదేవి
నటనా రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన శ్రీదేవి, స్టెప్పేస్తే నాజూకు తనం, కళ్ళతో అమాయకంగా కనిపించే చిలిపితనం. ఇలా అనేక రకాలుగా అందరి మనసులు దోచుకున్నారు. కానీ అదే రీతిలో నిర్మాతగా నిలదొక్కుకోలేక పోయారు నటి శ్రీదేవి.
9. ఛార్మి
చాలా ఆక్టివ్ గా, చలాకీగా ఉండే ఛార్మి, నటిగా మంచి పాముఖ్యత సంపాదించుకున్నారు. మెహబూబా, పైసావసల్, లైగర్ వంటి భారీ బడ్జెట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. వీటి ద్వారా నష్టం కూడా భారీగానే ఎదురుకొన్నారు.
10. సుప్రియ యార్లగడ్డ
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన సుప్రియ యార్లగడ్డ గురించి పెద్దగా ఎవరికీ తెలియక పోవచ్చు. ఇక ఈమె నిర్మాణంలో, రాజ్ తరుణ్ “అనుభవించు రాజ” సినిమాను తెరకెక్కించారు. కానీ అనుకున్నంత ఫలితం రాకపోవడంతో నష్టపోయారు.
End of Article