ఆయనకి 55 …ఆమెకి 18 ..!! వీరిదొక విచిత్ర ప్రేమకథ… ఆ పాటే ఇద్దర్ని దగ్గర చేసింది.??

ఆయనకి 55 …ఆమెకి 18 ..!! వీరిదొక విచిత్ర ప్రేమకథ… ఆ పాటే ఇద్దర్ని దగ్గర చేసింది.??

by Anudeep

Ads

ప్రేమకు ఎల్లలు లేవు .. ప్రేమ గుడ్డిది.. ప్రేమకు ఏవి అడ్డురావు. ప్రేమకు ఏ అంతరాలు లేవు.ఇలా ప్రేమ గురించి ఎన్నో నిర్వచనాలు వింటూ ఉంటాం..అటువంటి వాటిని రుజువు చేస్తున్న సంఘటనలు ఎదురైతే ఆశ్చర్య పోతాం.. ఆ కోవకి చెందిందే ఈ ప్రేమకథ..పాకిస్థాన్ కు చెందిన యాభై అయిదేళ్ల వ్యక్తి , ఓ పద్దెనిమిదేళ్ల యువతి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు . వాళ్ళిద్దరికీ వారధిగా నిలిచింది బాబీ డియోల్ పాట.

Video Advertisement

వివరాల్లోకి వెళ్తే పాకిస్థాన్కు చెందిన పద్దెనిమిదేళ్ల ముస్కాన్ పాటలు చాలా బాగా పాడుతుంది. వాళ్ళింటికి ఎదురుగా ఉండే యాభై అయిదేళ్ల ఫరూక్ ను ఆమె స్వరం ఆకట్టుకుంది. తరచూ ఆమె స్వరాన్ని వినేందుకు వాళ్ళింటికి వెళ్ళేవాడు. పాటల గురించి చర్చించుకొనేవారు. అలా వాల్లిద్దరి మధ్య పరిచయం పెరిగింది.

కొన్ని రోజుల తర్వాత ఆమె బాబీ డియోల్ పాటైనా ‘నా మిలో హంసే జాదా’ అనే పాట ద్వారా తన ప్రేమను వ్యక్త పరిచింది . “నాకు సంగీతం అంటే ఇష్టం. అలా ముస్కాన్ము తో పరిచయం పెరిగింది. తర్వాత ముస్కాన్ నాకు ప్రపోజ్ చేసింది. ముందు షాక్ అయ్యాను కానీ నేను కూడా తనను ప్రేమిస్తున్నాను అని తెలుసుకున్నాను. తన ప్రేమ నాకు ఎంతో అమూల్యమైనది” అని ఫరూక్ తెలిపారు. “నాపై ఫరూక్ చూపించే అభిమానం నన్ను ఆకట్టుకుంది. మా బంధాన్ని అందరు ఏం అనుకున్నా ఏం పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులు మొదట్లో ఒప్పుకోలేదు. ఆయన కోసం ఏదైనా చెయ్యగలను, ప్రాణాలు కూడా ఇవ్వగలను” అని ముస్కాన్ తెలిపింది.

సయ్యద్ బాసిత్ అలీ అనే యూ ట్యూబర్ వీళ్ళను ఇంటర్వ్యూ చేయడంతో వీళ్ళ కథ వెలుగులోకి వచ్చింది. యు ట్యూబ్ లో పెట్టిన ఆ వీడియో లో ఆ జంట తమ ప్రేమకథను పంచుకుంది. ప్రస్తుతం ఈ విచిత్ర ప్రేమ కథ ట్రెండింగ్ గా మారింది. చివరికి ఈ ప్రేమ జంట పెళ్లితో కథ సుఖంతం చేసుకుంది.


End of Article

You may also like