“పవన్ కళ్యాణ్” బర్త్‌డేకి “ఖుషి” కాకుండా… “జల్సా” ఎందుకు రిలీజ్ చేశారు..? కారణం ఇదేనా..?

“పవన్ కళ్యాణ్” బర్త్‌డేకి “ఖుషి” కాకుండా… “జల్సా” ఎందుకు రిలీజ్ చేశారు..? కారణం ఇదేనా..?

by Anudeep

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా రీ-రిలీజ్ అయ్యింది. దీంతో పవర్ స్టార్ అభిమానులకు పండగలా ఉంది.

Video Advertisement

కానీ జల్సా సినిమా కాకుండా ఖుషి సినిమాను రిలీజ్ చేస్తే బావుండేదానిని కొందరు అభిమానులు భావిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో “ఖుషి” బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే విషయం తెల్సిందే. ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్, భూమిక హీరో, హీరోయిన్లుగా నటించారు. 2001 ఏప్రిల్ 26 న విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

why jalsa is released on pawan kalyan birthday instead of kushi

అందుకే పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసుంటే బావుండేదని కొందరు భావిస్తున్నారు. జల్సా కన్నా ఖుషికి ఎక్కువ మంది థియేటర్లకు వచ్చే వాళ్ళని భావిస్తున్నారు.అయితే ఖుషి సినిమా కాకుండా జల్సా రిలీజ్ చేయడం వెనుక ఒక కారణం ఉందని తెలుస్తోంది. తమ్ముడు సినిమా కూడా రీ రిలీజ్ అయినా దాని కన్నా ఎక్కువ థియేటర్లలో జల్సాను విడుదల చేసారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది. 2008 సంవత్సరంలో జల్సా విడుదలైనప్పుడు పాజిటివ్ టాక్ వచ్చినా కొందరు నెగటివ్ పబ్లిసిటీ చేశారు. దీని వాళ్ళ సినిమా సూపర్ హిట్ అయినా భారీ స్థాయిలో కలెక్షన్లు రాలేదు.


మరో వైపు ఏ ఎం రత్నం ‘హరి హర వీరమల్లు’ సినిమాకు సంబంధించిన పనులతో బిజీగా ఉండటంతో ‘ఖుషి’ రీ రిలీజ్ చేయడం కుదరలేదని తెలుస్తుంది. ఈ కారణంగానే ఖుషి బదులు జల్సా మూవీ ని విడుదల చేసారు. ఇప్పుడు కుదరక పోయినా వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుకి విడుదల అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు పవన్ హీరోగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు చిత్రం సగం చిత్రీకరణ పూర్తి చేసుకోగా వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు.


End of Article

You may also like