Ads
కుటుంబం అన్నాక సమస్యలు ఉంటూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించి గొడవలు పడటం మనం చూస్తూనే ఉంటాం. కానీ అందరు నివ్వెరపోయే ఓ సంఘటన ఢిల్లీ లో చోటు చేసుకుంది. వృత్తి రీత్యా సబ్ ఇన్సెక్టర్ అయిన ఓ మహిళ తన అత్తా మామలకు చుక్కలు చూపించింది. అందరికి న్యాయం చేస్తూ ప్రజలను సంరక్షించాల్సిన ఆమె రౌడీలా ప్రవర్తించింది.
Video Advertisement
వృద్ధుడైన తన మావయ్యను పదే పదే కొట్టింది. లెంపలు వాయించింది. తన తల్లితో పాటు కలిసి రెచ్చిపోయింది. ఇదంతా అక్కడ కెమెరాల్లో రికార్డ్ కావడంతో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ బాధితులు ఆమెపై ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేసారు పోలీస్ లు.
వివరాల్లోకి వెళ్తే.. సబ్ ఇన్సెక్టర్ గా పనిచేస్తున్న ఓ అమ్మాయి. తన సొంత అత్త మామలను దూషించడమే కాదు.వయస్సులో పెద్దవాడని కూడా చూడకుండా మావయ్యపై పిడిగుద్దులు కురిపించింది. డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆ అమ్మాయికి .. తన అత్తమామల మధ్య గత కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. వారి మధ్య వివాదం కోర్టు వరకూ కూడా వెళ్లింది.
ఢిల్లీలోని లక్ష్మీ నగర్లోని వారి ఇంటికి ఆదివారం తన తల్లితో కలసి వెళ్లింది. ముందు తల్లీకూతుళ్లు వారితో వాగ్వాదానికి దిగారు. తర్వాత కోడలు మావయ్యపై దాడి చేసింది. పదే పదే కొట్టింది. తన అత్తమామలను దూషించింది. దాడి చేసే ముందు పోలీసు కోడలు, ఆమె తల్లి ఆయనతో తీవ్ర వాగ్వాదం చేశారు. వెంటనే ఇద్దరూ కలసి ఒకరి తర్వాత ఒకరు అతనిని కొట్టారు. దాడిలో ఆమె తల్లి కూడా ఆమెకు సహాయం చేసింది.
ఇంకా విచిత్రమేమిటంటే ఇదంతా మరో పోలీసు ఆఫీసర్ ఎదురుగా జరిగింది. ఆయన వారించినా.. పట్టించుకోకుండా దాడికి పాల్పడ్డారు. దీనిపై దాడికి గురైన అత్తమామలు.. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తన కోడలు పోలీసు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమపై జులుం చేస్తుందని, రెండేళ్లుగా తమ కుటుంబాన్ని వేధిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు సబ్ ఇన్స్పెక్టర్ తన అత్తమామలను కొట్టిన వీడియో బయటకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమెపై 323, 427 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. దీనిపై విచారణ జరుపుకుతున్నామని, ఆ పోలీసు అధికారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
watch video :
#WATCH | Case registered under section 323/427 IPC after a video of Sub-Inspector thrashing her in-laws in Delhi's Laxmi Nagar went viral. Info shared with concerned authority to take suitable departmental action against the erring police official: Delhi Police
(CCTV Visuals) pic.twitter.com/VUiyjVtZQl
— ANI (@ANI) September 5, 2022
End of Article