Ads
చిన్నప్పుడు తమ సినిమా కెరీర్ ని మొదలు పెట్టి తరువాత యాక్టర్లుగా పరిచయమయ్యి తమకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో స్టార్ హీరోలు ఉన్నారు ఇంకా ఎందరో క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా ఉన్నారు.
Video Advertisement
అలా చిన్నప్పుడే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇప్పుడు మళ్లీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వాళ్ళలో కొంతమందిని ఇప్పుడు చూద్దాం.
#1. సుహాని కలిటా – మనసంతా నువ్వే
మనసంతా నువ్వే, ఎలా చెప్పను చిత్రాల్లో బాలనటిగా నటించింది. తర్వాత సవాల్, కృషి, శ్రీశైలం సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
#2. సనూష – బంగారం
బంగారం తో పాటు ఎన్నో తమిళ సినిమాల్లో బాలనటిగా నటించింది. ఇటీవల విడుదలైన జెర్సీ సినిమా లో రమ్య పాత్ర పోషించింది.
#3. ఆనంద్ వర్ధన్ – సూర్యవంశం
చిన్నప్పుడు సూర్యవంశం, ప్రియరాగాలు వంటి ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పుడు హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
#4. దివ్య నగేష్ – అరుంధతి
అరుంధతి సినిమాలో చిన్న అనుష్క గా నటించింది. ఆ సినిమా కి నంది అవార్డు కూడా అందుకుంది. నేను నాన్న ఓ అబద్ధం సినిమాలో హీరోయిన్ గా నటించింది.
#5. షాలిని – జగదేకవీరుడు అతిలోకసుందరి
షాలిని చిన్నప్పుడు ఎన్నో సినిమాల్లో నటించింది. జగదేకవీరుడు అతిలోకసుందరి లో తన చెల్లి షామిలి తో పాటు షాలిని కూడా ఉంది. తర్వాత సఖి, అద్భుతం ఇలాంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.
#6. అనుష్క మల్హోత్రా – డాడీ
డాడీ సినిమాలో చిరంజీవి, సిమ్రాన్ ల కూతురు గా నటించింది.
#7. శ్రీదివ్య – యువరాజు
యువరాజు లో బాలనటిగా కనిపించింది. తర్వాత తూర్పు వెళ్ళే రైలు సీరియల్ లో నటించింది. ఆ తర్వాత మనసారా, కేరింత, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, వారధి సినిమాల్లో నటించింది. తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ్ సినిమాల్లో కూడా నటిస్తూ అక్కడ చాలా మంచి పేరు తెచ్చుకుంది.
#8. పవిత్ర పూరి – బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై
బుజ్జిగాడు మేడిన్ చెన్నై సినిమా లో త్రిష చిన్నప్పటి పాత్రలో నటించింది.
#9. మహేంద్రన్ – దేవి
దేవి సినిమా లో చిన్న పిల్లాడు అందరికీ గుర్తుండే ఉంటాడు. అతనే మహేంద్రన్. తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. విడుదలకు సిద్ధంగా ఉన్న విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించాడు.
#10. చక్రి తోలేటి – సాగర సంగమం
సాగర సంగమం లో హీరో తో ఉండే ఒక అబ్బాయి గా నటించాడు. దశావతారం సినిమాలో కూడా కనిపించాడు. ఇప్పుడు దర్శకుడు అయ్యాడు. ఈనాడు, బిల్లా 2, వెల్కమ్ టూ న్యూ యార్క్, ఖామోషి చిత్రాలకి దర్శకత్వం వహించాడు.
#11. కావ్య కళ్యాణ్ రామ్ – గంగోత్రి
గంగోత్రి సినిమాలో నటించిన కావ్య ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తున్నారు.
#12. నిత్య – దేవుళ్ళు
దేవుళ్ళు సినిమాలో రాశి, పృథ్వి కి కూతురు గా నటించింది. దాగుడుమూత దండాకోర్, నువ్వు తోపురా, పడేసావే, ఓ పిట్ట కథ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
వీరు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది చిన్నప్పుడు సినిమాల్లో నటించిన వారు ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు.
End of Article