Ads
బిగ్ బాస్ సీజన్ 6 మొదటి వారం నామినేషన్ల ప్రక్రియ నిన్న (సెప్టెంబర్ 7 న) ముగిసింది . కాకపోతే కథ సీజన్లకు భిన్నంగా ఈ నామినేషన్స్ ఉండేలా బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేశారు. నామినేషన్స్ అండ్ కెప్టెన్సీ టాస్క్ లలో వైవిధ్యం ఉండేలా చూస్తున్నారు.
Video Advertisement
గతంలో ఆదివారం నాడు బిగ్ బాస్ షో మొదలైతే.. సోమవారం నాడే నామినేషన్స్ పెట్టేవారు. దాంతో నామినేట్ చేయడానికి సరైన కారణాలు ఉండేవి కావు. అయితే ఈసారి నామినేషన్స్ ప్రాసెస్ ‘క్లాస్ – ట్రాష్ ’ టాస్క్‌తో ఆసక్తిగా మార్చేశారు. ఈ టాస్క్‌లో గీతూ, ఆది రెడ్డి, నేహా చౌదరిలు ప్రతిభ చూపడంతో నామినేషన్స్ నుంచి తప్పించుకుని కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు.
బాలాదిత్య, ఇనయ, అభినయ డైరెక్ట్‌గా నామినేట్ అయ్యారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవర్నైతే నామినేట్ చేయాలని అనుకుంటారో.. వాళ్ల పేర్లు పేపర్‌పై రాసి ఆ చీటీలను టాయిలెట్ సీట్లో వేయాలి.. ఇలా ఎక్కువ ఎవరి పేర్లు పడతాయో వాళ్లు నామినేట్ అయినట్టు. ఆ నామినేషన్స్‌లో ప్రాసెస్‌లో మొత్తం ఏడుగురు నిలిచారు.
తర్వాత బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తూ ట్రాష్‌లో ఉన్న బాలాదిత్య, అభినయ శ్రీ, ఇనయలలో ఒకర్ని సేవ్ చేయొచ్చని చెప్పడంతో.. క్లాస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ బాలాదిత్యని నామినేషన్స్ నుంచి సేవ్ చేసి.. ఆ ప్లేస్‌లో ఆరోహిని డైరెక్ట్‌గా నామినేట్ చేశారు. అలా స్వాప్ చేయడంతో బాలాదిత్య సేవ్ అయ్యి.. ఆరోహి నామినేట్ అయ్యింది.
మాటల యుద్ధం లా నడచిన ఈ నామినేషన్స్ ప్రక్రియలో నామినేట్ అయ్యింది ఎవరంటే..
1. ఆరోహి
2. ఇనయ
౩. అభినయ శ్రీ
4. సింగర్ రేవంత్
5 . జబర్దస్త్ ఫైమా
6 . శ్రీ సత్య
7 . చలాకీ చంటి
వీరిలో చలాకి చంటి, ఫైమా హౌస్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి వారు ఎలిమినేట్ కారు. సింగర్ రేవంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి ఓట్లు బానే పడతాయి. ఇక యాంకర్ ఆరోహి, అభినయ శ్రీ, ఇనయ, శ్రీ సత్య ఈ నలుగురులో ఒకరు ఈవారం ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.
కాగా జంటగా వచ్చిన రోహిత్, మెరీనాలను మాత్రం ఒక్కటిగానే ట్రీట్ చేయాలని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.ఈ జంట నామినేట్ చేయాలనుకున్నా.. లేదా.. వీళ్లని ఎవరైనా నామినేట్ చేయాలన్నా ఒక్క కంటిస్టెంట్ లాగానే భావించాలన్నాడు. ఈ లెక్కన బిగ్ బాస్ పెట్టిన కండీషన్ ప్రకారం.. రోహిత్, మెరీనా ఇద్దరిలో ఎవ్వరు ఎలిమినేట్ అయినా జంటగా హౌస్ నుంచి వెళ్లిపోవాల్సిందే.
End of Article