Ads
ఈ రోజుల్లో ప్రేమించుకోవడం, లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, పెళ్లి చేసుకోవడం… విడిపోవడం అనేది మన టాలీవుడ్ తారలకు బాగా కామన్ అయిపోయింది. మరీ చెప్పాలంటే ఇప్పుడు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సెలబ్రిటీలకు ఫ్యాషన్ గా మారింది. కానీ అన్ని పెళ్లిళ్లు చేసుకున్న వీరు కలిసి ఉంటారు అన్న గ్యారంటీ మాత్రం లేకుండా పోతుంది.
ఈ టైపులో పెళ్లి వరకు వచ్చి విడిపోయిన టాలీవుడ్ జంటలు ఎవరో చూద్దామా.
Video Advertisement
1-శింబు – హన్సిక :
హాట్ గ్లామర్ బ్యూటీ హన్సిక మరియు రొమాంటిక్ హీరో శింబు లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. ఎప్పుడు చూసినా జంట గువ్వల ఒకే దగ్గర ఉండే వీళ్ళు, సడన్ గా విడిపోయి ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితి వరకు వచ్చారు.
2-త్రిష – వరుణ్ :
చెన్నై బ్యూటీ త్రిష కు వ్యాపార వేత్త వరుణ్ మణియన్ అప్పట్లో పెద్ద లవ్ స్టోరీ నడిచింది. ప్రేమతో ఆగకుండా త్రిష – వరుణ్ గ్రాండ్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత యాక్టింగ్ కెరీర్ వద్దు అన్న విషయంపై ఇద్దరికీ గొడవలు జరగడంతో వీరు విడిపోయారు.
3-ఉదయ్ కిరణ్ – సుస్మిత
అతి చిన్న వయసులో రాలిన సినీ తార ఉదయ్ కిరణ్ తన కెరీర్ స్టార్టింగ్ లో మంచి ఫామ్ లో ఉండే వాడు. కరెక్ట్ గా అదే టైంలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఉదయ్ కిరణ్ తో చిరంజీవి స్వయంగా ఈ పెళ్లి కుదిర్చారు. వీళ్ళిద్దరికీ ఎంతో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ ఎవరికీ తెలియని కారణాలవల్ల సడన్ గా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఈ బ్రేకప్ మాత్రం ఉదయ్ కిరణ్ కెరీర్ పతనానికి ఓ కారణమని చెప్పొచ్చు.
4- నయనతార – ప్రభుదేవా:
అంతకుముందే పెళ్లయి పిల్లలు ఉన్న ప్రభుదేవా నయనతారను ఇష్టపడడంతో భార్యకు విడాకులు ఇచ్చాడు. నయనతార ఏకంగా ప్రభుదేవా కోసం మతం కూడా మార్చుకోవడానికి సిద్ధపడింది. కానీ తెలియదు కారణాలవల్ల వీళ్ళిద్దరూ విడిపోయారు.
5- అక్షయ్ కుమార్ – శిల్పాశెట్టి :
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి మరియు యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాల వల్ల శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ విడిపోయారు. తర్వాత అక్షయ్ ట్వింకిల్ ఖన్నాను పెళ్లాడి సెటిల్ అయ్యాడు.
6- రష్మిక మందన్న – రక్షిత్ శెట్టి :
ఎక్స్ప్రెషన్ క్వీన్ రష్మిక మందన్న కన్నడంలో తన కెరీర్ స్టార్టింగ్ దశలోనే తన కో ఆక్టర్ రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. తర్వాత చాలా కొద్ది కాలానికే వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇంతలో ఆమెకు తెలుగులో సూపర్ హిట్స్ తో పాటు మంచి స్టార్డం రావడంతో కెరీర్ ముఖ్యం అనుకుని…. రష్మిక ఆ ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంది.
సిద్ధార్థ – సమంత
సమంత కూడా నాగచైతన్యకు ముందు సిద్ధార్థ తో చాలా రోజులు ప్రేమలో ఉంది. కానీ తర్వాత అభిప్రాయ భేదాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు
ఇవి కూడా చదవండి నిజంగా కృష్ణంరాజు ఆ కోరిక తీరకుండానే కన్ను మూశారా…….?
End of Article