Home Filmy Adda “కృష్ణం రాజు” గారి ఆస్తుల విలువ ఎంతో తెలుసా..??

“కృష్ణం రాజు” గారి ఆస్తుల విలువ ఎంతో తెలుసా..??

by Anudeep

1966లో సినిమాల్లోకి ప్రవేశించి రెబెల్ స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు కృష్ణంరాజు. ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. నటుడిగా, నిర్మాతగా, కేంద్ర మంత్రిగా ఆయన అనేక బాధ్యతలను నిర్వర్తించారు.

కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలే కావడంతో.. తన తమ్ముడి కుమారుడైన ప్రభాస్‌ను తన కొడుకుగా భావించేవారు. ప్రభాస్‌ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఆయనది కీలక పాత్ర.

krishnam raju properties
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో క్షత్రియ వంశంలో జన్మించిన కృష్ణంరాజుది సంపన్న కుటుంబం. మేనమామగా పల్నాటి పౌరుషం చూపాలన్నా బొబ్బిలి బ్రహ్మన్నగా రౌద్ర రసం ప్రదర్శించాలన్నా మొగల్తూరు రాజుగారికే చెల్లు. కెరీర్ ఆరంభంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలేసిన కృష్ణంరాజు తెలుగునాట భక్త కన్నప్పగా ప్రేక్షకుల జేజేలు అందుకున్నారు.

krishnam raju properties
ఆయనకు పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి. ఆయన 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో ఎన్నో ఆస్తులు సంపాదించారని తెలుస్తోంది. కృష్ణంరాజుకి వారసత్వంగా మొగల్తూరులో కొన్ని వందల ఎకరాల భూమి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ భూమి నిర్వహణ మొత్తం మొగల్తూరులో ఉన్న కృష్ణంరాజు బంధువులే చూసుకుంటున్నట్లు అక్కడివారు స్పష్టం చేశారు .
ఇకపోతే మొగల్తూరులో ఈయనకు ఒక భవనం కూడా ఉందట.

krishnam raju propertiesఅంతే కాకుండా చెన్నై , హైదరాబాద్ వంటి మహానగరాలలో మొత్తం నాలుగు ఖరీదైన ఇళ్ళు కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న ఇంటి ఖరీదు 18 కోట్ల రూపాయలు. హైదరాబాదులో కృష్ణంరాజుకు ఒక ఫామ్ హౌస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గోపీకృష్ణ నిర్మాణ సంస్థను కూడా కృష్ణంరాజు స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎన్నో చిత్రాలను కూడా తెరకెక్కించారు.

krishnam raju properties
ఈయన దగ్గర రూ. 90 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ కార్, రూ.40 లక్షల విలువైన టయోటా ఫార్చునర్ కారుతో పాటు రూ.2 కోట్ల రూపాయల విలువ చేసి మరికొన్ని కార్లు ఉన్నట్లు సమాచారం.

krishnam raju properties
మరోవైపు ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే నోరూరించే వంటకాలతో విందు భోజనం రెడీ అయిపోతుంది. ఈ అలవాటు కృష్ణం రాజుకి తన తండ్రి నుంచి వారసత్వంగావచ్చిందట. ఇప్పడు ప్రభాస్ కి కూడా ఆ అలవాటు వచ్చింది. కృష్ణం రాజుకి మొత్తం ముగ్గురు కుమార్తెలు. వారి పేర్లు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి. వయో భారంతో సినిమాల్లో నటించడం తగ్గించిన కృష్ణం రాజు చివరిసారిగా ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం లో కనిపించారు.

You may also like