Home Filmy Adda గాడ్ ఫాదర్ సినిమాలో “సత్యదేవ్” విషయంలో… ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా..?

గాడ్ ఫాదర్ సినిమాలో “సత్యదేవ్” విషయంలో… ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా..?

by Anudeep

ఇంకో మూడు వారాల్లో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ మోహన్ రాజా డైరెక్షన్ లో భారీ అంచనాల మధ్య వస్తుంది. లూసిఫర్ సినిమాకు రీమేక్ ఈ మూవీ. సినిమా ఫస్ట్ లుక్ ,టీజర్ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఆన్లైన్లో ఈ మూవీ సెన్సేషన్ సృష్టించింది. దానితో ఇప్పుడు అందరూ ఈ మూవీ రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి మాస్ గెటప్ చాలా ట్రెండీగా ఉంది. అలాగే ఇందులో నయనతార యాక్షన్ కూడా మంచి మార్కులే వచ్చాయి. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రకు గాను సత్యదేవ్ ని ఎంచుకున్నారు. సత్యదేవ్ భార్య క్యారెక్టర్ లోని నయనతార నటిస్తుంది. ఈ మూవీలో సత్యదేవ్ క్యారెక్టర్ పేరు జయదేవ్.

is this right decision for satya dev in god father movie

అయితే ప్రస్తుతం గాడ్ ఫాదర్ మూవీలో సత్యదేవ్ ని విలన్ గా ఎంపిక చేయడం కరెక్టేనా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆచార్య మూవీకి సత్యదేవ్ మైనస్ పాయింట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సత్యదేవ్ టాలెంట్ ఉన్న నటుడు కానీ అన్ని వర్గాల ప్రేక్షకులలో అతనికి భారీ స్థాయిలో గుర్తింపు లేదు. లూసిఫర్ లో ఈ క్యారెక్టర్ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ చేశారు.

chiranjeevi god father teaser bgm copied from a recent telugu song

లేడీ సూపర్ స్టార్ నయనతార భర్తగా ఈ మూవీలో సత్యదేవ్ ఎంపిక సరి కాదు అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. వయసు పరంగా తీసుకున్న సత్యదేవు నయనతార కంటే నాలుగు సంవత్సరాలు చిన్న. అది కాకుండా సత్యదేవ్ పాత్రను చంపడానికి ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇస్తాడు. దీనిపై ఎంతోమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

did megastar chiranjeevi changed his name

గాడ్ ఫాదర్ చిత్రం దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ లో ఎటువంటి మార్పు లేదని చిత్ర యూనిట్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. హిందీలో కూడా ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంతో చిరంజీవికి పాన్ ఇండియా సక్సెస్ గ్యారంటీ అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ తరుణంలో సత్యదేవ రోల్ గురించి వైరల్ అవుతున్న కామెంట్స్ విషయంలో గాడ్ ఫాదర్ క్రియేటర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

You may also like