Home Filmy Adda “మా జీవితాల నుండి వెళ్ళిపోయింది..!” అంటూ… నాగ చైతన్య, సమంత విడాకులపై “నాగార్జున” కామెంట్స్..!

“మా జీవితాల నుండి వెళ్ళిపోయింది..!” అంటూ… నాగ చైతన్య, సమంత విడాకులపై “నాగార్జున” కామెంట్స్..!

by Anudeep

చాలా ఏళ్లుగా ప్రేమించుకొని 2017 లో పెళ్లి చేసుకున్న చై- సామ్ జంట ఏడాది క్రితం విడాకులు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. క్రేజీ కపుల్ అయిన సమంత, నాగ చైతన్య విడిపోవడం ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే కాదు అభిమానులకి కూడా హార్ట్ బ్రేకింగ్ గా మారింది.

ఇప్పటికీ వీరిద్దరి గురించి సోషల్ మీడియా లో చర్చ జరుగుతూనే ఉంది. నాగ చైతన్య, సమంత మాత్రం వారి వారి ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయిపోయారు. కానీ వీరిని విడాకుల ఛాయలు మాత్రం ఇంకా విడిచిపెట్టలేదు. తరచుగా మీడియా ముందు చైతు, సమంతకి.. వారి కుటుంబ సభ్యులకు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

nagarjuna about sam-naga chaitanya divorce
ఈ నేపథ్యంలో.. నాగార్జున పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో నటించారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నాగార్జునకి నాగ చైతన్య విడాకుల గురించి ప్రశ్న ఎదురైంది. ఒక జాతీయ మీడియాతో ముచ్చటించిన సందర్భంగా నాగార్జున చైతు, సమంత విడాకుల గురించి ఓపెన్ అయ్యారు.

nagarjuna about sam-naga chaitanya divorce
నాగ చైతన్య ప్రొఫెషనల్ లైఫ్ కంటే వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ఇది అతన్ని భాదించడం లేదా ? అని ప్రశ్నించారు. దీనికి నాగ్ బదులిస్తూ.. ‘ నాగ చైతన్య సంతోషంగా ఉన్నాడు. చైతు సంతోషంగా ఉంటే నాకు అది చాలు. అది జీవితం లో ఒక అనుభవం. కానీ దురదృష్టకరమైనది. దాని గురించే ఆలోచిస్తూ కూర్చోలేము. అది జరిగిపోయింది. మా జీవితాల నుంచి వెళ్ళిపోయింది. ఎవరి జీవితంలో అయినా ఇలాంటివి జరిగితే దాని నుంచి బయటపడాలి’ అని తెలిపారు. దీంతో ప్రస్తుతం నాగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

nagarjuna about sam-naga chaitanya divorce
ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షో లో పాల్గొన్న సమంత తన విడాకుల గురించి మాట్లాడారు. మా విడాకులు అంత సున్నితం గా జరగలేదు అని సామ్ తెలిపారు. కానీ ఇప్పటి వరకు నాగ చైతన్య విడాకుల గురించి మాట్లాడలేదు. మరోవైపు సమంత తండ్రి ఈ విడాకులు తీసుకోవడం తనను చాలా బాధించిందని అన్నట్లు తెలుస్తోంది. చై సామ్ విడాకులు ప్రకటించిన తర్వాత నాగ్ స్పందిస్తూ..’సమంత తో గడిపిన క్షణాలు మాకు ఎప్పటికి గుర్తుంటాయి. వారిద్దరూ సంతోషం గా ఉండటమే మాకు కావాలి’ అని అన్నారు.

nagarjuna about sam-naga chaitanya divorce
నాగ చైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక సమంత యశోద, శాకుంతలం లాంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులని పలకరించబోతోంది.

You may also like