Home Filmy Adda ఆ స్టార్ దర్శకుడి కథతో… “రానా-త్రివిక్రమ్” సినిమా చేయబోతున్నారా..?

ఆ స్టార్ దర్శకుడి కథతో… “రానా-త్రివిక్రమ్” సినిమా చేయబోతున్నారా..?

by Anudeep

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో తెలుగు మీద మంచి పట్టు ఉన్న వాళ్ళలో రానా దగ్గుబాటి ఒకరు. సంభాషణలు పలకడంలో, ఉచ్ఛారణ విషయంలోనూ ఆయన పర్ఫెక్ట్ అని చెప్పాలి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో అది ప్రూవ్ అయ్యింది.

రానాకు ఎప్పటి నుంచో ఒక ఫుల్ లెంగ్త్ పౌరాణిక సినిమా చేయాలని ఉంది. హిందూ మైథలాజికల్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్య కశ్యప’ కథ చేయాలని కొన్ని ఏళ్లుగా రానా ప్రయత్నిస్తున్నారు. స్క్రిప్ట్ డిస్కషన్స్ నుంచి ప్రీ విజువలైజేషన్ వరకు చాలా వర్క్స్ జరిగాయి.

rana-trivikram is going to do that movie..??
ఇప్పుడు ఆ కథను కొన్ని మార్పులు చేర్పులతో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేపట్టబోతున్నారని సమాచారం. ఇప్పుడు ఆ సినిమా బ్యానర్‌ కూడా మారుతోంది. దాంతోపాటు దర్శకుడు కూడా మారుతున్నారట. ‘హిరణ్య కశ్యప’ సినిమాను తొలుత సురేష్ ప్రొడక్షన్స్ మీద ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. గుణశేఖర్‌కు కూడా భాగస్వామిగా ఏవో చర్చలు జరిగాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది.

rana-trivikram is going to do that movie..??
హిరణ్య కశ్యప’ సినిమాను హారిక అండ్ హాసినిలో చేయడానికి రానా కూడా ఓకే అన్నారట. ఆల్రెడీ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారని టాక్. గుణశేఖర్ కథకు, త్రివిక్రమ్ కథకు చాలా డిఫరెన్స్ ఉందని సురేష్ ప్రొడక్షన్స్ వర్గాల కథనం.
‘భీమ్లా నాయక్’ సినిమాతో రానా, త్రివిక్రమ్ మధ్య పరిచయం పెరిగింది. అప్పుడు ‘హిరణ్య కశ్యప’ డిస్కషన్ వచ్చిందట.

స్వతహాగా త్రివిక్రమ్‌కు హిందూ పురాణాలు, ఇతిహాస గ్రంథాలపై ఆసక్తి ఎక్కువ. ఆయన మంచి పట్టు ఉంది. ‘హిరణ్య కశ్యప’ కథకు తనదైన టచ్ ఇవ్వడంతో… ఆయన్ను సినిమా చేయమని రానా ఒత్తిడి చేశారట. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయడానికి త్రివిక్రమ్ కూడా ఓకే అన్నారట. హారిక హాసిని ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలసి సురేశ్‌బాబు ఈ సినిమా నిర్మిస్తారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌కి వెళ్లే సరికి అక్కడ కరణ్‌ జోహార్‌ ఓ నిర్మాత అవుతారని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

rana-trivikram is going to do that movie..??
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ ఒక సినిమా చేస్తున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వాళ్ళిద్దరి కలయికలో హ్యాట్రిక్ చిత్రమిది. ఇది పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ హీరోగా మరొక సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రానా దగ్గుబాటి ‘హిరణ్య కశ్యప’ సినిమా ఉంటుందట. లేదా మహేష్ సినిమా తరువాతైనా ఉండొచ్చని అంటున్నారు. ఈ సినిమా స్టార్ట్ కావడానికి మరో ఏడాది లేదా ఏడాదిన్నర సమయం పడుతుందని సమాచారం. ‘విరాట పర్వం’ తర్వాత రానా మరొక సినిమా చేయలేదు. ‘హిరణ్య కశ్యప’ సినిమా స్టార్ట్ అయ్యే వరకూ మరో సినిమా చేయకూడదని ఆయన ప్లాన్ చేసుకున్నారట.

You may also like