మెగాస్టార్ “గాడ్ ఫాదర్” సినిమా కోసం… “సల్మాన్ ఖాన్” తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

మెగాస్టార్ “గాడ్ ఫాదర్” సినిమా కోసం… “సల్మాన్ ఖాన్” తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

by Anudeep

Ads

మెగా స్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీ తర్వాత జోష్ తగ్గకుండా సినిమాలు చేస్తున్నారు. చిరు రాబోయే చిత్రం ‘గాడ్ ఫాదర్’ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి నటించిన లాస్ట్ మూవీ ఆచార్య నిరాశపరచడంతో ఇప్పుడు గాడ్ ఫాదర్ పై భారీ అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్స్.

Video Advertisement

మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

salman remuniration for megastar movie
ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిరు, సల్మాన్ కాంబోలో రీసెంట్ గా రిలీజ్ అయినా ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది.
సినిమాలో సల్మాన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. గాడ్ ఫాదర్ సినిమా కోసం సల్మాన్ భారీ రెమ్యునరేషన్  అందుకున్నడని టాక్. బాలీవుడ్ లో బిజీగా ఉన్న సల్మాన్ అక్కడ ఒకొక్క సినిమాకు దాదాపు 100 కోట్ల వరకు అందుకుంటున్నాడు. ఇక గాడ్ ఫాదర్ కోసం సల్మాన్ ఏకంగా 40 కోట్ల వరకు అందుకున్నాడని తెలుస్తోంది.

salman remuniration for megastar movie
ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు కాబట్టి అక్కడ కూడా ఈ సినిమా మంచి మార్కెట్ ను క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇక ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ సిస్టర్ పాత్రలో నటిస్తున్నారు. సత్యదేవ్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను వచ్చే నెల దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ చేయాలని పిక్స్ అయ్యారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో.. ప్రమోషన్స్ మీద గట్టిగా దృష్టి పెట్టారు టీమ్. మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.


End of Article

You may also like