చిరంజీవి “గాడ్ ఫాదర్” ఫైనల్ కట్ రివ్యూ..! ఇలా అన్నారేంటి..?

చిరంజీవి “గాడ్ ఫాదర్” ఫైనల్ కట్ రివ్యూ..! ఇలా అన్నారేంటి..?

by Anudeep

Ads

మెగా స్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. చిరు రాబోయే చిత్రం ‘గాడ్ ఫాదర్’ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి నటించిన లాస్ట్ మూవీ ఆచార్య నిరాశపరచడంతో ఇప్పుడు గాడ్ ఫాదర్ పై భారీ అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్స్.

Video Advertisement

తెలుగుతో పాటు హిందీ లో కూడా విడుదల కానున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు ‘గాడ్ ఫాదర్’ సినిమాకి రివ్యూ చెప్పేశారు.

chiranjeevi's god father first review
” గాడ్ ఫాదర్ ఫైనల్ ఎడిటింగ్ అయిపోయింది.. రిపోర్ట్స్ వచ్చేసాయి. సినిమా మైండ్ బ్లోయింగ్ గా ఉంది. చిరంజీవి ఇరగదీసాడు” అని ఉమైర్ సంధు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఈ ట్వీట్ చూసి మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.. కానీ కొందరు నెటిజన్లు మాత్రం గతం లో ఆచార్య సినిమా సమయంలో కూడా ఈయన సూపర్ హిట్ రివ్యూ ఇచ్చారు. తీరా చూస్తే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూసింది.. చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

chiranjeevi god father movie final cut review by umair sandhu

 

మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

chiranjeevi's god father first review

ఇక అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ఏమైనా అదనపు హంగులు జోడించవచ్చా అనే విషయంపై సినిమా యూనిట్ తల మొనకలై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సల్మాన్, పూరి జగన్నాథ్, సునీల్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చే ఐటెం సాంగ్ సినిమాను మరో లెవల్ కు తీసుకువెళ్లేలా సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. చిరు, సల్మాన్ కాంబోలో రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

godfather-movie-song-lyrics

ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు కాబట్టి అక్కడ కూడా ఈ సినిమా మంచి మార్కెట్ ను క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను వచ్చే నెల దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ చేయాలని పిక్స్ అయ్యారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో.. ప్రమోషన్స్ మీద గట్టిగా దృష్టి పెట్టారు టీమ్. మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.


End of Article

You may also like