Home Filmy Adda మరొక సినిమాలో శరవణ స్టోర్స్ ఓనర్ “శరవణన్”..! కానీ ఈసారి ట్విస్ట్ ఏంటంటే..?

మరొక సినిమాలో శరవణ స్టోర్స్ ఓనర్ “శరవణన్”..! కానీ ఈసారి ట్విస్ట్ ఏంటంటే..?

by Anudeep

వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ పేరు గురించి పరిచయం అవసరం లేదు చెన్నైలో ఈయనకు సంబంధించిన ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇలా పలు వ్యాపారాలు చేస్తూ వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయనకి నటనపై ఎంతో ఆసక్తి ఉండడంతో ఏకంగా 50 సంవత్సరాల వయసులో మొహానికి రంగు వేసుకుని కెమెరా ముందుకు వచ్చారు. శరవణన్ నిర్మాణంలో ‘ది లెజెండ్’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉన్నత నిర్మాణ విలువలతో లెజెండ్ మూవీ తెరకెక్కించారు. ఇందులో ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా నటించారు. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో లెజెండ్ చిత్రాన్ని విడుదల చేశారు. బడ్జెట్ లో పదో వంతు కూడా లెజెండ్ వసూలు చేయలేకపోయింది. లెజెండ్ ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ రూ. 17 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం.

legend saravanan next movie
వేల కోట్ల ఆస్తి కలిగిన అరుళ్ తన సొంత బ్యానర్ లో నిర్మించి విడుదల చేశారు. ఈ చిత్ర విడుదల సమయంలో ఆయనపై చాలా ట్రోల్ల్స్ వచ్చిన తట్టుకొని నిలబడ్డారు. లెజెండ్ మూవీతో వచ్చిన నష్టం మొత్తం ఆయనే భరించారు. ఏదో ముచ్చట తీర్చుకోవడానికి ఒక సినిమా చేశాడని అందరూ అనుకున్నారు. వ్యవహారం చూస్తే సినిమాను సీరియస్ కెరీర్ గా తీసుకున్నాడు అనిపిస్తుంది . అరుళ్ మరో మూవీకి సిద్ధం అవుతున్నారు. అరుళ్ కొత్త మూవీ ప్రకటన త్వరలో రాబోతుందట. కోలీవుడ్ ఫిల్మ్ ట్రాకర్ రమేష్ బాల ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.

legend saravanan next movie
కానీ ఈసారి ట్విస్ట్ ఏంటంటే అంతకుముందు చేసింది యాక్షన్ సినిమా కానీ ఈసారి మాత్రం రొమాంటిక్ డ్రామా జోనర్ లో ఆరుళ్ తన నెక్స్ట్ చిత్రం చేయనున్నారు అంట. ఆల్రెడీ ఓ నూతన దర్శకుడి కథ ఓకే చేసి, త్వరలో గ్రాండ్ గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే అని సమాచారం. అరుళ్ కొత్త మూవీ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఈయన ప్రకటించారు.ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్స్ మొదటి సినిమాకి 60 కోట్లు ఖర్చు చేసిన రెండవ సినిమాకి మరెన్ని కోట్లు ఖర్చు చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి చర్చలు జరుపుతున్నారు.

You may also like