Home Filmy Adda “సాయి పల్లవి” కి ఏమయ్యింది..? ఈ మౌనానికి కారణం ఏంటి..?

“సాయి పల్లవి” కి ఏమయ్యింది..? ఈ మౌనానికి కారణం ఏంటి..?

by Anudeep

‘ఫిదా’ చిత్రంతో తెలుగులో అడుగు పెట్టిన సాయి పల్లవి అందరి ద్రుష్టి తన వైపుకి తిప్పుకుంది. గతేడాది ‘ శ్యామ్ సింగరాయ’ చిత్రం తర్వాత ‘విరాట పర్వం’ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో సినిమా అప్డేట్ లేదు.

మధ్యలో గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్‌గా ‘ గార్గి’ అనే చిత్రాన్ని చేసారు. తమిళంతో పాటు, తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది.

no update on sai pallvi next movies
ఆ తర్వాత ఈ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఉన్నట్లుండి సైలెంట్ అయ్యారు. ఆమె నుండి కొత్త చిత్రాల ప్రకటన ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ లేడీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. ఇంతకు ముందు లాగా ఆమె సిల్వర్ స్క్రీన్ పై బిజీ కావాలని కోరుకుంటున్నారు.

no update on sai pallvi next movies
తెలుగు, తమిళ భాషల్లో సాయి పల్లవికి ఫుల్ డిమాండ్ ఉంది. ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమెకు ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే సత్తా ఉంది. అందుకే దర్శక నిర్మాతలు ఆమె వెనుకబడుతున్నారు. ఆమె సైన్ చేస్తే కోరిన రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమాల్లో పెట్టుకునే నిర్మాతలు ఉన్నాయి.

no update on sai pallvi next movies
గార్గి అనంతరం సాయి పల్లవి మరో మూవీ ప్రకటించలేదు. పుష్ప పార్ట్ 2లో సాయి పల్లవి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నా… దానిపై అధికారిక సమాచారం లేదు. చాలా డిమాండ్ ఉన్న హీరోయిన్ సాయి పల్లవికి ఆఫర్స్ రావడం లేదా? లేక ఆమె ఒప్పుకోవడం లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి.

no update on sai pallvi next movies
కాగా సాయి పల్లవి పాత్ర నచ్చకుండా సినిమా ఒప్పుకోరు అన్న విషయం తెల్సిందే. మరోవైపు గ్లామర్ రోల్స్ కి దూరం. కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేస్తారు. రెమ్యునరేషన్ కి కక్కుర్తి పడి సినిమాలు చేసే రకం కాదు. ఆ కారణంగా కూడా సాయి పల్లవికి అవకాశాలు తగ్గి ఉండవచ్చు. అంతే కాకుండా సాయి పల్లవికి పెళ్లి కుదిరిందని అందుకే సినిమాలు ఒప్పుకోవట్లేదు అన్న పుకార్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

You may also like