Ads
సినిమాల తర్వాత ప్రేక్షకులని అంతగా అలరించేది టెలివిజన్. ఇందులో కూడా ఎంతో మంది వ్యక్తులు ఎన్నో కొత్త కాన్సెప్ట్ ఉన్న ప్రోగ్రామ్స్ తో ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. వారిలో ఒకరు ఓంకార్. ఎన్నో సంవత్సరాల నుండి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న ప్రోగ్రామ్స్ ని ప్రోత్సహించడంలో ఓంకార్ ముందు ఉంటారు.
Video Advertisement
ఆట డాన్స్ షో ఒక సమయంలో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక డాన్స్ షో ఇలా కూడా ఉంటుందా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ తర్వాత ఎన్నో సీజన్స్ వచ్చాయి. తర్వాత ఆట షో ఆపేశారు. అదే సమయంలో మాయాద్వీపం, ఇంకా ఎన్నో షోస్ ఓంకార్ చేశారు. ఒక సమయంలో ఎక్కడ చూసినా ఓంకార్ షోస్ కనిపించేవి. ఆ తర్వాత చాలెంజ్ కూడా చేశారు. అది కూడా ఇలాంటి డ్యాన్స్ షో అవడంతో దానికి కూడా ఒక క్రేజ్ వచ్చింది.
కొంతకాలం టెలివిజన్ కి దూరం అయ్యి మళ్ళీ ఇస్మార్ట్ జోడి వంటి ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అలాగే సిక్స్త్ సెన్స్ ప్రోగ్రామ్ కూడా చేశారు. ఇప్పుడు ఓంకార్ డాన్స్ ఐకాన్ అనే మరొక డాన్స్ షో చేస్తున్నారు. అయితే ఓంకార్ షోస్ బాగున్నా కూడా చాలావరకు ట్రోలింగ్ కి కూడా గురవుతాయి. అందుకు కారణం ప్రోగ్రామ్స్ లో కంటెస్టెంట్స్ కి చాలా కష్టాలు ఉన్నాయి అంటూ చెప్పడం. సాధారణంగా కష్టపడి పైకొచ్చే వాళ్ళందరి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఉంటాయి కానీ అక్కడ టాలెంట్ కంటే ఇలాంటి కష్టాలు ఇలాంటి విషయాలు చెప్పి సింపతితో షో పాపులర్ అవుతూ ఉంటుంది.
ఇప్పుడు డాన్స్ ఐకాన్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. వచ్చే ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి ఏదో ఒక స్టోరీ ఉంది అన్నట్టు చెప్తున్నారు. ఒకరు ఆర్థికంగా అంత ఉన్నవారు కాదు అని, ఒకరికి ఇంట్లో ఒప్పుకోలేదు అని, ఒకరు డాన్స్ కూడా నేర్చుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు అని, ఒకరికి తిండి కూడా సరిగ్గా దొరకలేదు అని, ఒకరి దగ్గర వేసుకోవడానికి మంచి బట్టలు లేవు అని ఇలా చాలా కథలు చెప్పారు. అవన్నీ నిజమే. కానీ ప్రతి షోలో ఇలాంటి విషయాలని చెప్పి సింపతితో వాళ్లు గుర్తింపు తెచ్చుకోవాలి అని ఎంతకాలం ప్రయత్నిస్తారు.
“ఇలా కష్టపడి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా? వాళ్ళందరూ కూడా ఇలాగే చెప్పుకుంటూ ఉంటారా? ఒకరికి ఇద్దరికీ అంటే ఓకే. ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి ఇలా ఏదో ఒక స్టోరీ ఉంది అన్నట్టు చెప్తూ ఉంటే చూడాలి అనిపించే వారికి ఆసక్తి ఉంటుందా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో ఆట షో కూడా ఇలాగే చేశారు. సరే ఒకసారి అంటే బానే ఉంది. తర్వాత కూడా వచ్చే ప్రతి షోలో ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటే ఎలా? “ఒక స్టేజ్ కి రావాలి అంటే ఇలాంటి కష్టాలు సాధారణమే కదా? ఎందుకు వారి ప్రతిభ అంత బాగున్నప్పుడు ఇలాంటివి హైలైట్ అయ్యేలా చేస్తున్నారు?” అంటూ చాలా కామెంట్స్ వస్తున్నాయి.
End of Article