Ads
నిజానికి పెళ్లి అంటే ఈ మధ్య ఫోటోషూట్స్ ని ఎక్కువ చేస్తున్నారు అందమైన పూల మధ్య వధువు, వరుడు నించుని ఫోటోలు తీసుకోవడం లేదంటే దగ్గర్లో ఏదైనా కొలను కానీ బీచ్ కానీ ఉంటే వెళ్లి ఫోటోలు తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. ప్రకృతి మధ్య ఫోటో షూట్ చేస్తే చాలా అందంగా ఫోటోలు వస్తాయి.
Video Advertisement
కొంత మంది అయితే ఎందుకు తలనొప్పి అంటూ మామూలుగా ఫోటోలు తీసుకుని వెనక బ్యాక్గ్రౌండ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ వధువు మాత్రం నిజంగా హైలెట్. ఎప్పుడు మీరు ఇలాంటి ఫోటో షూట్ చూసి వుండరు.
కేరళకు చెందిన ఈ వధువు ఫోటో షూట్ ని ఎంతో అద్భుతంగా చేయించుకుంది. పైగా ఇది ఒక ముఖ్య సందేశాన్ని కూడా ఇస్తోంది. మరి ఇంతకీ ఆ వధువు ఫోటో షూట్ ఎలా తీయించుకుంది అనేది చూద్దాం. కేరళకు చెందిన ఈ వధువు గోతుల పడ్డ రోడ్డు మీద అందంగా నడుచుకుంటూ వస్తూ ఫోటో షూట్ చేయించుకుంది.
ఈమె రోడ్డు మీద గోతులు ఉన్నాయని ఫోటో షూట్ ద్వారా సమస్యని హైలైట్ చేసింది ఈ వీడియోలో వధువు అందంగా నడవడం… ఫోటోగ్రాఫర్ వీడియో తీయడం మనం చూడొచ్చు. అందమైన ఎర్రటి చీరని వధువు ధరించి.. ఆనందంగా నడుచుకుంటూ రావడాన్ని మనం ఇందులో చూడొచ్చు. అయితే ఆమె నడుస్తున్న రోడ్డంతా కూడా వర్షపు నీటితో నిండిపోయింది. బురదగా కూడా వుంది రోడ్ అంతా.
పైగా పక్క నుండి వస్తున్న వాహనదారులు ఎంతో కష్టంగా కింద పడి పోతానేమో అన్నట్లు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 11న ఈ వీడియోని పోస్ట్ చేయగా 4.3 మిలియన్ మంది చూశారు. విపరీతంగా లైకులు కూడా వచ్చాయి. ఈ వధువు క్రియేటివిటీకి ఇంటర్నెట్లో యూజర్లు ఇంప్రెస్ అయిపోయారు. చాలామంది ఫన్నీ కామెంట్లు కూడా చేశారు.
రోడ్ కాదు సరస్సు అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. రోడ్ బాగుంది కానీ అది రోడ్ ఏనా అని మరో యూజర్ కామెంట్ చేసారు. చేప పిల్లలని కొంటె చేపల పెంపకం మొదలుపెట్టచ్చని మరొకరు కామెంట్ చేసారు.
ఆగస్టు 9న కేరళ హైకోర్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)ని తమ ఆధీనంలో వున్నా రోడ్లను సరిగ్గా ఉంచాలని..తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. జాతీయ రహదారిపై వున్నా గుంతలో పడి ఒక వ్యక్తి చనిపోయాడు. అయితే అది అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి వెళ్లడంతో రిట్ పిటిషన్లు విచారణ చేపట్టారు.
watch video:
https://www.instagram.com/reel/CiXQ7rBvTUJ/?utm_source=ig_web_copy_link
End of Article